Neem Fruit : రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వేప పండ్లు తినండి.. జ‌రిగే అద్భుతాలు చూడండి..!

Neem Fruit : వేప చెట్టు.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేప‌చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలుంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆయుర్వేదంలో ఈ వేప చెట్టును అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మ‌నంద‌రికి తెలుసు. అయితే చాలా మంది వేప చెట్టు ఆకుల‌ను, పూత‌ను, బెర‌డును, వేర్ల‌ను మాత్ర‌మే ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. వేప పండ్ల‌ను మాత్రం ఎవ‌రు ఔష‌ధంగ ఉప‌యోగించ‌రు. కానీ వేప పండ్లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

వీటిలో కూడా ఔష‌ధ గుణాలు, యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వ‌ర్షాకాలం ప్రారంభంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా తలెత్తే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ పండ్ల‌ను రోజుకు రెండు చొప్పున ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. అలాగే ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలన్నీ తొల‌గిపోతాయి. శ‌రీరం శుభ్రం ప‌డుతుంది.

Neem Fruit health benefits in telugu take daily on empty stomach
Neem Fruit

అదే విధంగా డ‌యాబెటిస్ తో బాధ‌పడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వేప పండ్ల‌ను తీసుకోవడం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల‌తో బాధ‌పడే వారు వేప పండ్లతో చేసిన క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో రెండు వేప పండ్లు, మూడు వేపాకులు వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే చిగుళ్ల వాపు, దంతాల నొప్పులు, దంత‌క్ష‌యం వంటి స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వేప పండ్ల‌ను నోట్లో వేసుకుని బాగా చ‌ప్ప‌రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

దంతాలు మ‌రియు చిగుళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ పండ్ల‌ను రోజుకు రెండు చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఫైల్స్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. అలాగే చుండ్రు, త‌ల‌లో దుర‌ద, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా వేప పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వేప పండ్ల గుజ్జును త‌ల చ‌ర్మానికి బాగా పట్టించి మ‌ర్ద‌నా చేయాలి. దీనిని అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత హెర్బ‌ల్ షాంపుతో లేదా ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ విధంగా వేప పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts