Kothimeera Vadalu : నూనె లేకుండా కొత్తిమీర వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kothimeera Vadalu : మ‌నం వంట్ల‌లో గార్నిష్ కోసం కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అల‌ర్జీలు త‌గ్గుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ కొత్తిమీర‌తో మ‌నం రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అలాగే ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం ఒక్క చుక్క నూనెను కూడా వాడాల్సిన అవ‌స‌రం లేదు. నూనె లేకుండా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కొత్తిమీర వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర వ‌డ‌ల తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొత్తిమీర 2 క‌ప్పులు, శ‌న‌గ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 5, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌.

Kothimeera Vadalu recipe in telugu make in this method
Kothimeera Vadalu

కొత్తిమీర వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కొత్తిమీర‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ కొత్తిమీర మిశ్ర‌మాన్ని చెక్క‌ అప్ప లాగా లేదా సిలిండ‌ర్ వ‌త్తుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు జ‌ల్లి గిన్నెను తీసుకుని దానికి నూనెను రాయాలి. త‌రువాత ఇందులో కొత్తిమీర మిశ్రమాన్ని ఉంచి ఆవిరి మీద ఉడికించాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వ‌డేయ్యాక జ‌ల్లిగిన్నెను ఉంచి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ‌య‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత దీనిని వ‌డ‌ల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, డీప్ ఫ్రైస్ అంటే ఇష్టంలేని వారు ఇలా రుచిగా కొత్తిమీర వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts