Pearl Millets : ర‌క్త నాళాల్లోకి కొవ్వును మొత్తం క‌రిగించేస్తాయి ఇవి.. రోజూ తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Pearl Millets : మ‌నంద‌రికి ప్ర‌ధాన ఆహారం బియ్యం. బియ్యాన్నే అన్నంగా వండుకుని తింటూ ఉంటాం. బియ్యం రాక‌ముందు మ‌నంద‌రికి ప్ర‌ధాన ఆహారం రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌లు.. ఈ మూడే ముఖ్యంగా అంద‌రికి ప్ర‌ధాన ఆహారంగా ఉండేది. బియ్యం వచ్చిన త‌రువాత వీటిని మ‌నం ఆహారంగా తీసుకోవ‌డం త‌గ్గించాము. కానీ స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. స‌జ్జ అన్నం, స‌జ్జ రొట్టెలు, స‌జ్జ‌ల‌తో చేసే అల్పాహారాలు, పిండి వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. స‌జ్జ‌ల్లో లిగ్నిన్ అనే ఫైటో కెమిక‌ల్స్ ఉంటాయి. ఇవి గుండెలో ఉండే ర‌క్తనాళాల్లో కొవ్వు పొర‌లు పొర‌లుగా పేరుకుపోకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండెకు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ్వ‌క హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వీటిల్ ఉండే లిగ్నిన్ ర‌క్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి మ‌న‌ల్ని హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే వీటిలో పాలీ అన్ స్యాచురేటెడ్ ప్యాట్స్ ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే స‌జ్జ‌ల్లో 11 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. ఈ ఫైబ‌ర్ మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వుల‌ను, కొలెస్ట్రాల్ ను ర‌క్తంలో క‌ల‌వ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో మ‌నం బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌డంతో పాటు కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Pearl Millets benefits very much helpful in fat
Pearl Millets

స‌జ్జ‌ల‌ను ర‌వ్వ‌గా చేసి అన్నం, సంగ‌టి వాటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం త‌గ్గించి స‌జ్జ‌ల‌తో వండిన అన్నాన్ని తీసుకోవ‌డం మంచిది. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారు స‌జ్జ అన్నాన్ని తీసుకోవాలి. అలాగే నీడ‌లో ఉండి ప‌ని చేసే వారు, ఊబ‌కాయం, షుగ‌ర్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారు సజ్జ రొట్టెల‌ను ఆహారంగా తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈవిధంగా సజ్జ‌లు మ‌న ఆరోగ్యానికి, మ‌న గుండెకు ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts