Phool Makhana : ఫూల్ మ‌ఖ‌నాల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Phool Makhana : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో ఆరోగ్య‌వంత‌మైన‌వి ఏవో చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు ల‌భిస్తున్న అనేక ఆహారాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉంటున్నాయి కానీ వాటిని గుర్తించ‌డం చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు అవి అందుబాటులోనే ఉంటాయి, కానీ కొన్ని ఆహారాల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి ఆహారాల్లో ఫూల్ మ‌ఖ‌నా కూడా ఒక‌టి. వీటినే తామ‌ర విత్త‌నాలు అని కూడా అంటారు. ఇవి కాస్త ఖ‌రీదు ఎక్కువ‌గానే ఉంటాయి. అయితే ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌మ‌నే చెప్పాలి. ఫూల్ మ‌ఖ‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగ‌ర్‌కు మెడిసిన్‌..

ఫూల్ మ‌ఖ‌నాలు త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారికి ఇవి మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు, త‌గ్గుతాయి. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని త‌ర‌చూ తింటే షుగ‌ర్ లెవల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక వీటిని తింటే ఐర‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీంతో ర‌క్తం అధికంగా త‌యార‌వుతుంది. దీని వ‌ల్ల ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఫూల్ మ‌ఖ‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. క‌నుక ఫూల్ మ‌ఖ‌నాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఫూల్ మ‌ఖ‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు, నొప్పులు, మంట‌లు త‌గ్గుతాయి. అలాగే ఆక్సీక‌రణ ఒత్తిడి త‌గ్గుతుంది. దీంతో క్యాన్స‌ర్‌, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫూల్ మ‌ఖ‌నాలు ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను త‌గ్గిస్తాయి. దీంతో మ‌హిళ‌ల్లో వ‌చ్చే పీసీవోడీ స‌మ‌స్య త‌గ్గుతుంది. దీని వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

Phool Makhana in telugu health benefits know about them
Phool Makhana

హైబీపీ త‌గ్గుతుంది..

ఫూల్ మ‌ఖ‌నాల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. హైబీపీ ఉన్న‌వారు రోజూ ఫూల్ మ‌ఖ‌నాల‌ను తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫూల్ మ‌ఖ‌నాల‌ను త‌ర‌చూ తింటుంటే శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాలు, వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అధిక బ‌రువు ఉన్న‌వారు వీటిని త‌ప్ప‌నిస‌రిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా ఫూల్ మ‌ఖ‌నాల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts