Maida Pindi : మైదా పిండి ఎలా త‌యార‌వుతుందో తెలిస్తే ఇక‌పై దాన్ని తిన‌డం మానేస్తారు..!

Maida Pindi : మ‌నం బ‌య‌ట లేదా ఇంట్లో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటాము. వాటిల్లో అనేక ర‌కాల స్వీట్లు, కేకులు, బ్రెడ్‌, పిండి వంట‌కాలు, నూనె ప‌దార్థాలు ఇలా ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువ‌గా ఏ పిండి వాడుతారో తెలుసు క‌దా. అవును, మైదా పిండినే వాడుతారు. అయితే సాధార‌ణంగా గోధుమ‌ల‌ను మ‌ర‌లో ఆడించి గోధుమ పిండి తీస్తారు. అదే రాగుల నుంచి అయితే రాగి పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి వ‌స్తాయి. మ‌రి మైదా పిండి దేనితో త‌యార‌వుతుంది ? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా. అయితే ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. కానీ మైదా పిండిని మాత్రం మ‌నం వాడుతున్నాం. అయితే మైదా పిండితో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. కానీ చాలా మంది విన‌డం లేదు. ఇక మైదా పిండిని దేంతో త‌యారు చేస్తారో తెలుసుకుందాం.

మైదా పిండిని ఇలా చేస్తారు..

సాధార‌ణంగా గోధుమ పిండిని ప‌ట్టేట‌ప్పుడు గోధుమ‌ల‌ను నేరుగా అలాగే మ‌ర‌లో వేస్తారు. దీంతో పిండి బ‌య‌ట‌కు వ‌స్తుంది. కానీ గోధుమ‌ల‌ను బాగా పాలిష్ చేసి మ‌ర‌లో వేస్తే మైదా పిండి త‌యార‌వుతుంది. గోధుమ‌లపై ఉండే పొర‌ను దాదాపుగా తీసేస్తారు. దీంతో లోప‌ల మృదువైన పిండి ఉంటుంది. అదే మైదా పిండి. ఇలా గోధుమ‌ల‌ను బాగా పాలిష్ ప‌ట్టి అనంత‌రం వాటిని మ‌ర‌లో వేసి తీయ‌గా వ‌చ్చేదే మైదా పిండి. ఈ పిండిలో అస‌లు ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. గోధుమ‌ల పైపొర‌లోనే పోష‌కాలు ఉంటాయి. క‌నుక మైదా పిండిని తింటే ఎలాంటి పోష‌కాలు ల‌భించ‌వు. పైగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇక మైదా పిండిని తెల్ల‌గా చేసేందుకు దానికి అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను క‌లుపుతారు. చివ‌ర్లో పొటాషియం బ్రోమేట్‌ను కలుపుతారు. దీంతో మైదా పిండి చాలా తెల్ల‌గా, మెత్త‌గా, మృదువుగా త‌యార‌వుతుంది. ఇలా చేసిన మైదా పిండి చాలా త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుంది. అందుక‌నే మైదా పిండిని చాలా మంది వాడుతారు. కానీ వాస్త‌వానికి ఇది ఏమాత్రం మంచిది కాదు.

how Maida Pindi will be made do you know about this
Maida Pindi

గారెలు, ఇడ్లీల త‌యారీలోనూ..

గోధుమ పిండి క‌న్నా కూడా మైదా పిండి చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది. అందుక‌నే హోటల్స్‌లోనూ పూరీల త‌యారీలో దీన్నే ఎక్కువ‌గా వాడుతారు. అలాగే దీంతో బొండాల‌ను కూడా వేస్తారు. దీంతోపాటు గారెలు, ఇడ్లీల త‌యారీలోనూ కొంద‌రు మైదాను వాడుతారు. ఇలా మైదా వాడ‌కం ఎక్కువైపోయింది. కానీ దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని మాత్రం చాలా మంది గ్ర‌హించ‌డం లేదు.

వాస్త‌వానికి మైదా పిండి అనేది వ‌ట్టి వ్య‌ర్థ ప‌దార్థం. ఇందులో కెమిక‌ల్స్ త‌ప్ప ఏమీ ఉండ‌వు. అందువ‌ల్ల దీన్ని తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా క్యాన్స‌ర్ వంటి రోగాలు వ‌చ్చే చాన్స్ ఉంటుంది. మైదా పిండి త‌యారీలో వాడే బ్రోమేట్ వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అందుక‌నే బ్రోమేట్‌ను నిషేధించారు కూడా. ఇక చాలా కీట‌కాలు కూడా మైదాను తిన్న వెంట‌నే చ‌నిపోతాయి. దానికి కార‌ణం అందులో ఉండే కెమిక‌ల్సే. దీన్ని బ‌ట్టి మైదా ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దో మీకు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇక మైదా పిండితో నీళ్లు క‌లిపి పోస్ట‌ర్లు అంటించేందుకు త‌ప్ప అది ఎందుకూ ప‌నికిరాదు. దీంతో చాలా మంది ర‌వ్వ దోశ‌లు, ప‌రోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజా, జిలేబీ, హ‌ల్వా వంటి అనేక స్వీట్లు చేస్తారు. క‌నుక ఇక‌పై మైదా పిండి వాడ‌కండి. దానికి బ‌దులుగా వేరే ఏదైనా పిండి వాడండి. లేదంటే అనారోగ్యాల పాలు కాక త‌ప్ప‌దు.

Editor

Recent Posts