Refined Oils : మనం వంటల్లో నూనెను వాడుతూ ఉంటాం. మనకు మార్కెట్ లో రకరకాల నూనెలు లభిస్తూ ఉంటాయి. అన్నీ నూనెలు మంచివనే మనం అనుకుంటాము. కానీ వీటిని రిఫైండ్ చేయడంతో పాటు కలపకూడని ఇతర నూనెలను కలిపి అమ్మేస్తూ ఉంటారు. నూనెలను వాడితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పూర్తిగా స్వచ్ఛందమైంది అన్న ప్రకటలను కూడా మనం చూస్తూ ఉంటాం. వీటిని చూసి రిఫైండ్ ఆయిల్స్ కంటే మంచిది మరొకటి లేదని మనం నమ్మి కొనుగోలు చేస్తూ ఉంటాం. ఫ్యూర్ ఆండ్ రిఫైండ్ ఆయిల్స్ ఆరోగ్యానికి మంచిదనేది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. సన్ ప్లవర్ ఆయిల్ లో 50 శాతం కొవ్వు ఉంటుంది. కిలో సన్ ప్లవర్ గింజలు 250 నుండి 300 రూపాయల మధ్యలో ఉంటుంది. స్వచ్ఛమైన లీటర్ సన్ ప్లవర్ ఆయిల్ తీయడానికి దాదాపు రెండు కిలోల గింజలు అవసరమవుతాయి.
రెండు కిలోల గింజలకు 600 రూపాయలు అవసరమవుతాయి. కానీ మనకు మార్కెట్ లో లభించే సన్ ప్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధర 160 నుండి 175 మధ్యలో ఉంటుంది. అలాగే పల్లీల్లో 40 శాతం కొవ్వు ఉంటుంది. స్వచ్ఛమైన పల్లీ నూనె తయారు చేయడానికి రెండున్నర కిలోల పల్లీలు అవసరమవుతాయి. రెండున్నర కిలో పల్లీలకు 375 రూపాయల ఖర్చు అవుతుంది. మనకు మార్కెట్ లో లభించే పల్లీ నూనె 170 నుండి 180 మధ్యలో ఉంటుంది. స్వచ్ఛమైన నూనె తయారు చేయడానికి ఖర్చు అధికంగా అవుతుంది. కానీ మనకు మార్కెట్ లో ఫ్యూర్ ఆయిల్స్ కూడా తక్కువ ధరలో లభిస్తున్నాయి. మనం వంటల్లో ఉపయోగించే వంట నూనెల్లో తక్కువ ధరలకు లభించే ఇతర నూనెలను కలిపి ఇవ్వడమనేది కొంత మేరకు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే గింజల నుండి నూనెను ఎక్కువగా బయటతీయడానికి వాటిని వేడి చేయడంతో పాటు వాటిలో ఎక్సైన్ అనే రసాయనాన్ని కలుపుతారు.
అలాగే నూనెలో ఉండే చెత్త చెదారాలను తొలగించి వాటి చక్కటి వాసన వచ్చేలా కూడా చేస్తూ ఉంటారు. అలాగే నూనెలు కంటికి ఇంపుగా కనబడడానికి అవి చక్కటి రంగు రావడానికి నూనెలకు బ్లీచింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలన్నింటినే రిఫైనింగ్ అంటారు. ఇలా తయారు చేసిన నూనెలను వాడడం వల్ల క్యాన్సర్, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆవ నూనెకు ఆర్గోమోన్ ఆయిల్ ను కలిపి కల్తీ చేస్తూ ఉంటారు. అలాగే సన్ ప్లవర్ నూనెకు, పల్లీ నూనెకు, నువ్వుల నూనెకు ఫామాయిల్ కలిపి కల్తీ చేస్తూ ఉంటారు. ఇలాంటి నూనెలను మనం మరిన్ని అనారోగ్య సమస్లయ బారిన పడే అవకాశం ఉంది. రిఫైండ్ నూనెలను కానీ, స్వచ్ఛమైన గానుగ నూనెను కానీ 220 నుండి 250 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తేనే కానీ కూరలను, వేపుళ్లను చేసుకోలేము.
ఇలా వేడి చేయడం వల్ల నూనెలో ఉండే అణువుల్లో ఎలక్ట్రాన్స్ దెబ్బతినడం, ఫ్రీరాడికల్స్ తయారవడం జరుగుతుంది. గానుగ ఆడించిన నూనెల్లో ఈ ప్రక్రియ కొద్దిగా నెమ్మదిగా జరుగుతుంది. ఈ విధంగా నూనెలను వాడడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గానుగ ఆడించిన నూనెలను వాడినప్పటికి వాటిని మరిగించడం మనకు నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రిఫైండ్ నూనెల కంటే గానుగ ఆడించిన నూనెలె మంచివి అయినప్పటికి నూనెలను ఎక్కువగా వేడి చేయకుండా తీసుకోవడం వల్ల మాత్రమే ఎటువంటి దోషాలు కలగకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.