Cauliflower Fry : కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రై ని ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Cauliflower Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విదంగా క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై ను క్యాట‌రింగ్ లో, క‌ర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా తయారు చేస్తూ ఉంటారు. రుచిగా, సుల‌భంగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాలీప్ల‌వ‌ర్ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – 3 టీ స్పూన్స్, మైదాపిండి – 3 టీ స్పూన్స్, బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్.

Cauliflower Fry recipe in telugu make in this way
Cauliflower Fry

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ను పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా క‌డిగి త‌రువాత వేడి నీటిలో వేసి 3 నిమిషాల పాటు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం పేస్ట్, శ‌న‌గ‌పిండి, మైదాపిండి, బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేసుకుని క‌ల‌పాలి. ఇందులో ఫుడ్ క‌ల‌ర్ ను కూడా వేసుకోవ‌చ్చు. త‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అంతా ముక్క‌ల‌ను ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ప‌కోడీలుగా వేసుకుని వేయించాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే నూనెలో ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. వీటిని క్యాలీప్ల‌వ‌ర్ పై వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై త‌యార‌వుతుంది. ఈ ఫ్రైను ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో సైడ్ డిష్ గా క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్ల‌వ‌ర్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts