మన కోసం కష్టపడి మనల్ని వృద్దిలోకి తీసుకు వచ్చిన తల్లిదండ్రులను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని నేటి ఆధునిక యుగంలో వయసు మళ్ళిన వారిని ఓల్డేజ్ హోం లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. కాని మన పిల్లల మాదిరిగా వాళ్ళని చూసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అందుకే వారి ఆరోగ్యం గురించి ఈ చిట్కాలను తెలుసుకుందాం. పెద్ద వయసు వారు ఆరోగ్యపరంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పులను తినాలి.
ప్రతి రోజు ఉదయం ఒక అర గంట వ్యాయామం లేదా ధ్యానం చేయాలి. కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. ఉప్పు వాడకం చాలా తగ్గించాలి. టీ, కాఫీ లకు దూరంగా ఉండాలి. ఆ స్థానంలో రాగి జావ మంచిది. సాధ్యమైనంత వరకు బయటి ఆహారం తినక పోవడం మంచిది. రోజుకి కనీసం 5 లీటర్ల నీరు తాగాలి. ఉదయాన్నే ఒక లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి. గంట తర్వాత ఒక లీటర్ నీరు తాగాలి. రాత్రి 7 గంటల లోపు ఆహారం తీసుకోవాలి.
తిన్న తరువాత కనీసం రెండు గంటలు ఆగి నిద్ర పోవాలి. ఉదయం అల్పాహారంగా ఇడ్లి, దోశ వారానికి ఒక సారి మాత్రమే తినాలి. నూనె వాడకానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. దాని స్థానంలో నెయ్యి వాడాలి. మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం. ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు చాలా మంచి ఆహారం.