Soaked Peanuts : రోజూ ఇవి పిడికెడు తింటే చాలు.. బ‌రువు వేగంగా పెరుగుతారు..!

Soaked Peanuts : మ‌న‌లో చాలా మంది వివిధ కార‌ణాల చేత బ‌రువు త‌గ్గిపోతూ ఉంటారు. బ‌రువు త‌గ్గి స‌న్న‌గా అవ్వ‌డం వ‌ల్ల ప‌క్క‌టెముక‌లు, మెడ భాగంలో ఎముక‌లు, తొంటి భాగంలో ఎముక‌లు క‌నిపిస్తాయి. స‌న్న‌గా ఉన్నప్ప‌టికి చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ స‌న్న‌గా ఉన్న వారిని చూసి చాలా మంది వీళ్లు ఏదో జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నార‌ని భావిస్తారు. అంతేకాకుండా స‌న్న‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎక్కువ‌గా ముడ‌త‌లు ప‌డుతుంది. దీంతో చిన్న వ‌య‌సులోనే ముస‌లివారిలాగా క‌నిపిస్తారు. క‌నుక స‌న్న‌గా ఉన్న వారు ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికి త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. అయితే ఇది అంత మంచి ప‌ద్ద‌తి కాదు. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే బీపీ, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశంఉంది.

క‌నుక బ‌రువు పెర‌గాల‌నుకునే వారు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కేవ‌లం జంక్ ఫుడ్ నే కాకుండా మంచి ఆహారాన్ని తీసుకుంటూ కూడా మనం బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. శ‌రీరానికి బ‌లాన్ని, కండ‌పుష్టిని అందించి బ‌రువును పెంచే చ‌క్క‌టి ఆహారాల‌ను తీసుకోవాలి. శ‌రీరానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్, శ‌క్తి క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ప‌చ్చికొబ్బ‌రిని ఎక్కువ‌గా తీసుకోవాలి. రోజూ అర చెక్క ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శ‌రీరంలో బలంగా త‌యార‌వుతుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా బ‌రురు పెర‌గ‌వ‌చ్చు. అలాగే బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. మాంసం, చికెన్ కంటే ప‌ల్లీల‌ల్లో 5 రెట్లు బ‌లం ఎక్కువ‌గా ఉంటుంది.

Soaked Peanuts take daily for weight gain and other benefits
Soaked Peanuts

రోజూ ప‌ల్లీల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. అలాగే ప‌ల్లీల‌ల్లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. 25 శాతం మాంస‌కృత్తులు ఉంటాయి. ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు రోజూ గుప్పెడు లేదా రెండు గుప్పెల్ల ప‌ల్లీల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. అదే విధంగా పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. బ‌ల‌మైన ఆహారాల్లో ఇవి కూడా ఒక‌టి. రోజూ 25 నుండి 30 గ్రాముల పుచ్చ‌గింజ‌ల ప‌ప్పును నాన‌బెట్టి రోజూ తీసుకోవ‌డం వల్ల శ‌రీర బ‌రువు పెరుగుతుంది. ఇక పొద్దు తిరుగుడు ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. వీటిలో బ‌లం మ‌రియు ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ పొద్దు తిరుగుడు ప‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.

అలాగే గుమ్మ‌డి గింజ‌ల‌ప‌ప్పును, నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. ఇవి రెండు కూడా మాంసం కంటే ఎక్కువ బ‌లాన్ని క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర పోష‌కాలు అందడంతో పాటు శ‌రీర బ‌రువు కూడా పెరుగుతుంది.ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా, ఆరోగ్యంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. అలాగే ఇవి మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌లో అంద‌రికి అందుబాటు ధ‌ర‌లో ల‌భిస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌పుష్టి క‌లిగి శ‌రీరం ఆక‌ర్ష‌ణీయంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts