Semiya Nimmakaya Pulihora : నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా ఒక్క‌సారి సేమియాతో చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Semiya Nimmakaya Pulihora : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. దీనితో చిరుతిళ్ల‌తో పాటు సేమియా ఉప్మాను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. సేమియా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌రుచూ ఉప్మాను కాకుండా దీనితో నిమ్మ‌కాయ పులిహోర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో చేసే ఈ నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, లైట్ గా డిన్న‌ర్ చేయాలి అనుకున్న‌ప్పుడు ఇలా సేమియాతో పులిహోర‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పుల్ల పుల్లగా రుచిగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా నిమ్మ‌కాయ పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – లీట‌ర్, సేమియా – ఒక క‌ప్పు, నూనె – 2 లేదా 3 టీ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీడిప‌ప్పు – 10 నుండి 15, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌కాయ – 1.

Semiya Nimmakaya Pulihora recipe in telugu very tasty
Semiya Nimmakaya Pulihora

సేమియా నిమ్మ‌కాయ పులిహోర త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు, ప‌సుపు, నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత సేమియా వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఈ సేమియాను వ‌డ‌క‌ట్టి చ‌ల్ల‌టి నీళ్లు పోసుకోవాలి. త‌రువాత దీనిని నీరంతా పోయేలా ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత సేమియా వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. అంతా క‌లిసేలా చ‌క్క‌గా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా నిమ్మ‌కాయ పులిహోర త‌యార‌వుతుంది. ఇది వేడిగా ఉన్న‌ప్పుడు ముద్ద‌గా ఉన్నా చ‌ల్లారే కొద్ది పొడిపొడిగా త‌యార‌వుతుంది. సేమియాతో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా పులిహోర‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts