హెల్త్ టిప్స్

Barley Seeds : ఈ గింజ‌ల‌ను తీసుకుంటే చాలు.. థైరాయిడ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Barley Seeds : ఇటీవలి కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు జింక్, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలేనియం వంటి పోషకాలు అవసరం.

ఈ పోషకాలు కలిగిన ఆహారాల‌ను తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు బార్లీ గింజలను తీసుకుంటే థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది. బార్లీ గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేదంటే బార్లీ పిండిని జావగా చేసుకొని తాగవచ్చు. లేదంటే బార్లీ పిండిని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో కూరల్లో లేదా చపాతీలు, అట్లు వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.

take barley seeds regularly to reduce thyroid problem

బార్లీ గింజలు మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి. అలాగే బార్లీ నీటిని తాగటం వలన థైరాయిడ్‌ సమస్య తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయి. అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు తగినంత నీరు తాగాలి. అలాగే తగినంత నిద్ర ఉండాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా థైరాయిడ్‌ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. అప్పుడే థైరాయిడ్‌ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే థైరాయిడ్‌ ఉన్నవారు డాక్టర్ సూచన ప్రకారం తప్పనిసరిగా మందులు వాడాలి. దీంతో ఇత‌ర ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts