Coconut : కొబ్బరికాయలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండు కొబ్బరిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కొబ్బరిని ఔషధంగా కూడా వాడుతారు. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అయితే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కొద్దిగా తీసుకుని దాన్ని రాత్రి పూట నిద్రకు ముందు తినాలి. దీంతో అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొబ్బరిని రాత్రి నిద్రకు ముందు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరిని రాత్రి పూట నిద్రకు ముందు తినడం వల్ల మలబద్దకం అన్నది ఉండదు. ఈ సమస్యను తగ్గించడంలో ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. కనుక రాత్రి నిద్రకు ముందు కాస్త పచ్చి కొబ్బరిని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. మరుసటి రోజు ఉదయం సాఫీగా విరేచనం అవుతుంది. కనుక రాత్రి నిద్రకు ముందు పచ్చి కొబ్బరిని కాస్త తినాలి. ఇక రాత్రి పూట హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
రాత్రి పూట 2 నుంచి 4 గంటల సమయంలో ఎక్కువగా గుండె పోటు వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ రాత్రి నిద్రకు ముందు కాస్త పచ్చి కొబ్బరిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే ముప్పు తగ్గుతుంది. కనుక రాత్రి నిద్రకు ముందు కొబ్బరిని తప్పనిసరిగా తినాలి. అలాగే ఇలా కొబ్బరిని తినడం వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. కనుక రాత్రి నిద్రకు ముందు కొబ్బరిని తినాల్సి ఉంటుంది.
కొబ్బరి చర్మ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అలాగే కొబ్బరిని తినడం వల్ల నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. కనుక రాత్రి నిద్రకు ముందు తప్పకుండా పచ్చి కొబ్బరిని కాస్త తినాలి. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.