Immunity Drink : రోజుకు 2 సార్లు దీన్ని తాగితే.. ఇమ్యూనిటీ 10 రెట్లు పెరుగుతుంది..

Immunity Drink : ప్ర‌స్తుత చ‌లికాలంలో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం కూడా ఒక‌టి. శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్యాక్టీరియా, వైర‌స్ ల సంఖ్య పెరిగి అనేక ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ వైర‌స్ ల‌ను, బ్యాక్టీరియాల‌ను న‌శింప‌జేసి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రిచే ఈ క‌షాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోద‌క శ‌క్తి పెరిగి మ‌నం ఎటువంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మ‌నం ఒక జార్ లో 4 మిరియాల‌ను వేయాలి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను, పావు టీ స్పూన్ సోంపును కూడా వేయాలి. త‌రువాత వీటిని వీలైనంత మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత రెండు ఇంచుల అల్లం ముక్క‌ను తీసుకుని శుభ్రప‌రిచి చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక చిన్న ప‌చ్చి ప‌సుపు కొమ్మును తీసుకుని శుభ్ర‌ప‌రిచి దీనిని కూడా ముక్క‌లుగా చేయాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే అల్లం ముక్క‌లు, ప‌సుపు ముక్క‌లు, ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడిని వేసి ఒక గ్లాస్ నీళ్లు ముప్పావు గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి.

take daily this Immunity Drink 2 times to increase it
Immunity Drink

ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిలో రుచి కొర‌కు ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి క‌లుపుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవ‌చ్చు. అలాగే సంవ‌త్స‌రం దాటిన పిల్ల‌ల నుండి వృద్ధుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు దీనిని తీసుకోవ‌చ్చు. ఈ క‌షాయాన్ని త‌ర‌చూ తీసుకుంటే ఉంటూ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ క‌షాయం త‌యారీలో ఉప‌యోగించిన ప‌దార్థాల‌న్నింటిలో కూడా యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు స‌హ‌జంగానే ఉంటాయి.

ఇవి మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అంతేకకాకుండా శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండి త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డేవారు ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌శ శ‌క్తి పెరిగి అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం.

D

Recent Posts