హెల్త్ టిప్స్

Fenugreek Seeds : మెంతులను దీనితో కలిపి తినండి.. డయాబెటిస్‌ పోతుంది..

Fenugreek Seeds : ప్రస్తుత తరుణంలో షుగర్‌ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే షుగర్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే సరిగ్గా మందులను వాడుతూ కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే షుగర్‌ తప్పక నియంత్రణలో ఉంటుంది. షుగర్‌ గురించి అంతగా బెంగ పడాల్సిన పని ఉండదు. ఇక షుగర్‌ నియంత్రించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ఇవి షుగర్‌ లెవల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల మెంతులను షుగర్‌ ను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతులను రోజూ అర టీస్పూన్‌ మోతాదులో ఉదయాన్నే పరగడుపునే తినాలి. రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఇంకా మంచిది. అలాగే అర టీస్పూన్‌ మెంతుల పొడిని తేనెతో కలిపి తినవచ్చు. లేదా మజ్జిగలో కలిపి కూడా తాగవచ్చు. మెంతులు తింటే కొందరికి వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి వారు వీటిని మజ్జిగలో కలిపి తినడం శ్రేయస్కరం. ఇలా మెంతులను తింటే షుగర్‌ కచ్చితంగా కంట్రోల్‌ అవుతుంది. అయితే మెంతుల పొడిని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ పాలను రాత్రి పూట తాగాల్సి ఉంటుంది.

take fenugreek seeds like this for diabetes

మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్‌ చేస్తాయి. అందువల్ల మెంతులను తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ఇక మెంతుల్లో ఫైబర్‌ కూడా అధికంగానే ఉంటుంది. ఇది పిండి పదార్థాల శోషణను నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్లూకోజ్‌ స్థాయిలు త్వరగా పెరగవు. ఫలితంగా షుగర్‌ తగ్గుతుంది. ఇలా మెంతులతో చాలా సులభంగా షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.

ఇక మెంతులతోపాటు రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో కాకరకాయ రసం లేదా ఉసిరికాయ జ్యూస్‌ను కూడా తీసుకోవాలి. దీంతో షుగర్‌ మరింత నియంత్రణలోకి వస్తుంది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. సహజసిద్ధమైన పదార్థాలను వాడితే దీర్ఘకాలికంగా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

Admin

Recent Posts