Ginger : అల్లంతో ఇలా చేస్తే.. కిలోల కొద్దీ బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

Ginger : న‌డుము, పిరుదులు, తొడ‌లు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా మ‌నం చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాము. ఆయా శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మ‌నం లావుగా అయ్యామ‌ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌న‌కు ఇష్ట‌మైన దుస్తుల‌ను ధ‌రించ‌లేక‌పోతుంటాం. దీంతో శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వ‌ర‌గా, ప్ర‌భావ‌వంతంగా క‌రిగించే చిట్కాల కోసం వెతుకుతూ ఉంటాం. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. శ‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించడంలో అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది వేగంగా కొవ్వును క‌రిగించ‌గ‌ల‌దు. ఇందులో ఉన్న ఔష‌ధ గుణాలు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు అధిక కొవ్వును క‌రిగించ‌డంలో కూడా అల్లం అద్భుతంగా ప‌ని చేస్తుంది. న‌డుము, తొడ‌లు, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వును అల్లం తేలిక‌గా క‌రిగిస్తుంది. అల్లంలో ఉండే జింజ‌రాల్ అనే ప‌దార్థం శ‌రీరంలో ఉన్న అధిక నీటిని బ‌య‌ట‌కు పంప‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల కొవ్వు క‌రిగిపోతుంది. అలాగే పొట్ట‌లో పిహెచ్ లెవ‌ల్స్ ను పెంచ‌డంలో కూడా అల్లం స‌హాయ‌ప‌డుతుంది. అందువ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. దీంతో అజీర్తి, మ‌ల‌బద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచే శ‌క్తి కూడా అల్లానికి ఉంది. శరీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరిగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అల్లంతో అల్లం నీటిని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

take Ginger in this method for weight loss and other benefits
Ginger

అల్లం తో అల్లం నీటిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీనిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం నీటిని త‌యారు చేయ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక లీట‌ర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అల్లాన్ని తీసుకుని శుభ్ర‌ప‌రిచి ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచి నీటిలో వేసి మ‌రిగించాలి. ఆ త‌రువాత ఈ నీటిని వ‌డ‌కట్టి తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు నీటిలాగే తాగుతూ ఉండాలి. మూడు నుండి నాలుగు నెల‌ల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వచ్చు.

అదే విధంగా తొడ‌లు, పిరుదులు, న‌డుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. ఈ నీటిని ఏ రోజుకు ఆ రోజు త‌యారు చేసుకుని వాడడం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. ఈ విధంగా అల్లం నీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌నం ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts