హెల్త్ టిప్స్

Raisins : రాత్రి పూట కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. మీ శ‌రీరంలో ఈ మార్పులు జ‌రుగుతాయి..!

Raisins : కిస్మిస్‌లను స‌హ‌జంగానే చాలా మంది వివిధ ర‌కాల తీపి వంటకాల్లో వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే వీటిని స‌రైన స‌మ‌యంలో తింటేనే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాలి. అప్పుడే వీటితో క‌లిగే అన్ని బెనిఫిట్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇక రాత్రి పూట 20 కిస్మిస్‌ల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని తినాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కిస్మిస్‌ల‌లో బి విట‌మిన్లు, విట‌మిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌ల‌లా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

2. కిస్మిస్‌ల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మ‌న ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక కిస్మిస్‌ల‌ను తింటే శరీరం దృఢంగా మారుతుంది.

take soaked raisins daily do you know what happens

3. ఉద‌యాన్నే చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. కొంద‌రు రోజు మొత్తం శారీర‌క శ్ర‌మ‌ను అధికంగా చేస్తుంటారు. అలాగే కొంద‌రికి రోజంతా శ‌క్తి లేన‌ట్లు బ‌ల‌హీనంగా అనిపిస్తుంటుంది. ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు. నిస్స‌త్తువ‌గా ఉంటుంది. అయితే వీరంద‌రూ రోజూ ప‌ర‌గ‌డుపునే కిస్మిస్‌ల‌ను తింటే శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఎంత ప‌ని చేసినా అల‌సిపోరు. చురుగ్గా ఉంటారు.

4. కిస్మిస్‌ల‌ను తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. కిస్మిస్‌ల‌ను తింటే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. ఫలితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల ఐర‌న్ బాగా ల‌భిస్తుంది. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

6. కిస్మిస్‌ల‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Admin

Recent Posts