బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ జంట ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.2010లో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘అభిషేక్, నేనూ రోజూ గొడవపడుతున్నాం..’ అని చెప్పింది. అలాగే మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇవి త్వరలో పరిష్కరించబడుతుంది అని చెప్పింది.
మా మధ్య చిన్న చిన్న డిస్ట్రబెన్స్ లేకపోతే జీవితం పూర్తి బోరింగ్‌గా ఉంటుంది. విభేదాలని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని అప్పుడు పేర్కొంది. అయితే అప్పటి నుండి అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు విడాకుల దాకా వెళ్లాయని ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తామిద్దరం కలిసే ఉన్నామని చెబుతున్నా కూడా వారి విడాకులకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. అయితే తాజగా ఐష్, అభిషేక్ ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఇందులో వారిద్దరు కబడ్డీ మ్యాచ్‌కి హాజరు కాగా, ఇందులో అభిషేక్ ఐశ్వర్య చేతిని పట్టుకుని, ఆమెకు ఏదో వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆమె ఆ సమయంలో చాలా సీరియస్‌గా కనిపిస్తుంది. ఇది చూసిన వారు అప్పటి నుండే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని అంటున్నారు.
ఐశ్వర్యరాయ్‌తో విడాకులపై ఓ సారి అభిషేక్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ..మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు.. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్‌ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేనంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్.