హెల్త్ టిప్స్

Over Weight : అధిక బరువు తగ్గాలంటే.. ఈ రోజు నుండే ఈ 5 పదార్థాలను తినడం స్టార్ట్ చేయండి..

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య అనేది నేటి త‌రుణంలో చాలా కామ‌న్ అయిపోయింది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారే అధికంగా బ‌రువు ఉండేవారు. కానీ ఇప్పుడు మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా చిన్న వ‌య‌స్సులోనే ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. దీంతో యుక్త వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి బీపీ, షుగ‌ర్ వంటివి అటాక్ అవుతున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కింద చెప్పిన ఆహారాల‌ను రోజూ తింటుంటే దాంతో అధిక బ‌రువు త‌గ్గ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇక బ‌రువును త‌గ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో బాదం ప‌ప్పు ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. వీటిలో విట‌మిన్ ఇ తోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగిస్తాయి. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. క‌నుక రోజూ గుప్పెడు బాదం ప‌ప్పును తింటే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది. అయితే బాదం ప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం తింటే మంచిది. దీంతో ఉద‌యాన్నే శ‌క్తి ల‌భించ‌డంతోపాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

take these 5 types of foods to reduce over weight take these 5 types of foods to reduce over weight

ఇక బ‌రువు త‌గ్గించ‌డంలో చిరు ధాన్యాలు కూడా ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. క‌నుక ఆహారం ఎక్కువ‌గా తీసుకోము. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. అయితే వీటిని రోజూ త‌గిన మోతాదులో తినాలి. రాగులు, జొన్న‌లు, స‌జ్జ‌లు, అరికెలు, సామ‌లు.. ఈ జాబితాకు చెందుతాయి. వీటిని తింటే బ‌రువు త‌గ్గుతారు. అలాగే కొబ్బ‌రి నూనెను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. శ‌రీర మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు సహాయ ప‌డుతుంది.

మిరియాలు, దాల్చిన చెక్క‌, ద్రాక్ష పండ్ల‌ను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ల‌ను కలిగి ఉంటాయి. క‌నుక కొవ్వును క‌రిగిస్తాయి. దీంతో బ‌రువు తగ్గ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. ఇలా పైన చెప్పిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటుంటే దాంతో బ‌రువు త‌గ్గ‌వచ్చు. అయితే రోజువారీ ఆహారంలో ఎక్కువ‌గా పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌, చిరు ధాన్యాల‌ను తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. క‌నుక వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో అద్భుత‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు.

Admin

Recent Posts