Fat : వీటిని తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది..!

Fat : నేష‌న‌ల్ ఒబెసిటీ ఫౌండేష‌న్ ప్ర‌కారం మ‌హిళ‌ల్లో, చిన్నారుల్లో ఊబ‌కాయం స‌మ‌స్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్‌ల‌ని ఆశ్ర‌యించే వారి సంఖ్యా ఎక్కువ‌వుతోంది. అయితే ఇత‌రత్రా ప‌ద్ద‌తుల క‌న్నా చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉప‌యోగప‌డే ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

take these foods to shed extra kilos of weight and Fat
Fat

అవిసె గింజ‌లు

రోజూ చెంచా అవిసె గింజ‌ల్ని ప‌చ్చ‌ళ్లు, టిఫిన్లూ, పండ్ల ర‌సాలు, ఓట్స్‌, మ‌జ్జిగ.. దేనితోనైనా స‌రే క‌లిపి తీసుకుంటే మంచిది. స‌లాడ్ల‌పైన అవినె గింజ‌ల నూనె చ‌ల్లుకుంటే మంచిది. అవిసె గింజ‌ల్లో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ‌ర్భిణీలు మాత్రం వీటికి దూరంగా ఉండ‌టం త‌ప్ప‌ని స‌రి.

Fat  : గ్రీన్ టీ

గ్రీన్ టీ లో శ‌రీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా శ‌రీర మెట‌బాలిజాన్ని ఉత్తేజం చేస్తూ, క్యాల‌రీల‌ను క‌రిగించే పోష‌కాలు గ్రీన్ టీ లో అదికంగా ఉంటాయి. కనుక రోజూ రెండు కప్పుల గ్రీన్‌ టీని తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

దాల్చిన చెక్క‌

ర‌క్తంలోని చ‌క్కెర నిల్వ‌ల‌ని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో దాల్చిన చెక్క పాత్ర కీల‌కం. శ‌రీరంలో పేరుకున్న చెడు కొల‌స్ట్రాల్ ని త‌గ్గించ‌డంలోనూ ఇది ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని పొడిగా చేసుకుని వేడి అన్నంలో వేసుకొని తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ పనితీరు మెరుగు ప‌డుతుంది. అంతే కాకుండా అధిక బరువు తగ్గుతారు.

మిరియాలు

జీర్ణక్రియ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డానికి తోడ్ప‌డే ప‌దార్థాల్లో మిరియాలు ఒక‌టి. ఇవి శ‌రీరంలో అన‌వ‌స‌రంగా కొవ్వు చేర‌కుండా సహాయ‌ప‌డుతాయి. స‌లాడ్లు, కూర‌ల్లో చిటికెడు మిరియాల పొడిని చ‌ల్లుకుని తిన‌డం వల్ల అవి రుచిగా కూడా ఉంటాయి. దీంతోపాటు అధికంగా ఉన్న బరువు సులభంగా తగ్గుతారు.

ప‌సుపు

ప‌సుపులో యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. ప‌సుపును వాడ‌డం వల్ల శ‌రీర మెట‌బాలిజం రేటు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొవ్వు పేరుకు పోకుండా నిరోధిస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఊబ‌కాయం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అధిక బరువు సులభంగా తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు కూడా కరుగుతుంది.

Share
D

Recent Posts