Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట నుంచి రెండో సాంగ్ రిలీజ్‌.. అదిరిపోయిందిగా..

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట‌. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలోంచి ఇటీవ‌లే క‌ళావ‌తి అనే సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా.. ఈ పాట ఎంతో మందిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. దీనికి చాలా మంది స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. కాగా ఈ మూవీ లోంచి రెండో పాట‌ను తాజాగా విడుద‌ల చేశారు.

Sarkaru Vaari Paata penny second song released
Sarkaru Vaari Paata

స‌ర్కారు వారి పాట నుంచి పెన్నీ అనే సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో మ‌హేష్ బాబు కుమార్తె సితార న‌టించింది. ఈ సాంగ్‌కు చెందిన ప్రోమోలోనూ సితార డ్యాన్స్ చేసి అల‌రించింది. అయితే పూర్తి సాంగ్‌లోనూ ఆమె ఉంటుంద‌ని ఊహించారు. అనుకున్న‌ట్లుగానే ఆమె ఈ పాట‌లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈ పాట‌కు చెందిన వీడియోను కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేయ‌గా.. ఈ పాట యూట్యూబ్‌లో ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతోంది.

ఇక స‌ర్కారు వారి పాట సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Editor

Recent Posts