మన చుట్టూ అందుబాటులో ఉండే పల రకాల పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలు భిన్న రంగుల్లో ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రంగుకు చెందిన ఆహారాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఎరుపు రంగులో ఉండే ఆహారాలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అవి పండ్లు లేదా కూరగాయలు లేదా ఇతర ఆహారాలు ఏవైనా కావచ్చు, ఎరుపు రంగులో ఉన్నాయంటే చాలు నోట్లో నీళ్లూరతాయి. ఈ క్రమంలోనే ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువల్లే అవి ఆ రంగులో కనిపిస్తాయి. అలాగే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసయనిన్స్ అధికంగా ఉంటాయి. అవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
2. ఎరుపు రంగు ఆహారాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు.
3. మన శరీరంలో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కనుక ఎరుపు రంగులో ఉండే పదార్థాలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో విటమిన్లు సి, ఎ లు అధికంగా ఉంటాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. అలాగే చర్మం, వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. ఎరుపు రంగు పదార్థాల్లో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర విధులను సక్రమంగా నిర్వహించడానికి సహాయ పడతాయి. ఈ పదార్థాల్లో పొటాషియం, సోడియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి.
6. ఎరుపు రంగు ఆహారాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. ఎరుపు రంగు పదార్థాల్లో క్వర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది ఆస్తమాను తగ్గిస్తుంది.
అందువల్ల ఎరుపు రంగులో ఉండే ఆహారాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు. టమాటాలు, చెర్రీలు, యాపిల్స్, ఎరుపు రంగు ఉల్లిపాయలు, స్ట్రాబెర్రీలు, దానిమ్మ, ప్లమ్స్, పండు మిరపకాయలు, రెడ్ బీన్స్, పుచ్చకాయలు, ఎరుపు రంగు క్యాబేజీ, ఎరుపు రంగు క్యాప్సికం వంటివి ఎరుపు రంగులో ఉండే ఆహారాలు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365