మిన‌ర‌ల్స్

పాల‌లోనే కాదు.. ఈ ప‌దార్థాల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది.. పాల‌ను తాగ‌లేని వారు వీటిని తిన‌వ‌చ్చు..!

రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విషయం అందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. అది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక పాల‌ను తాగ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కాల్షియం పేరు చెబితే కేవ‌లం పాలు మాత్ర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. కానీ నిజానికి పాలు కాకుండా ఇంకా ప‌లు ఇత‌ర ప‌దార్థాల్లోనూ మ‌న‌కు కాల్షియం ల‌భిస్తుంది. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

take these foods for calcium if you do not drink milk

1. నువ్వుల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది. 30 గ్రాముల నువ్వుల‌ను తింటే మ‌న‌కు 277 మిల్లీగ్రాముల కాల్షియం ల‌భిస్తుంది. అందువ‌ల్ల పాల‌ను తాగ‌లేని వారు నువ్వుల‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కాల్షియం ల‌భిస్తుంది. నువ్వుల‌ను పెనంపై కాస్తంత వేయించి రోజూ గుప్పెడు మోతాదులో తిన‌వ‌చ్చు.

2. సోయాబీన్‌ల‌ను మొల‌కెత్తించి తిన‌వ‌చ్చు. వాటిల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది. ఒక క‌ప్పు సోయాబీన్ మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల 230 మిల్లీగ్రాముల కాల్షియం ల‌భిస్తుంది.

3. చేప‌ల్లోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. 75 గ్రాముల చేప‌ల‌ను తింటే 200 మిల్లీగ్రాముల‌కు పైగానే కాల్షియం ల‌భిస్తుంది.

4. ప‌నీర్‌లోనూ కాల్షియం స‌మృద్ధిగానే ల‌భిస్తుంది. అర క‌ప్పు ప‌నీర్ ద్వారా 253 మిల్లీగ్రాముల కాల్షియంను పొంద‌వ‌చ్చు.

5. బాదంప‌ప్పుల‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఒక గుప్పెడు బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల 72 మిల్లీగ్రాముల కాల్షియం ల‌భిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts