గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరు రోజూ ఉదయాన్నే చద్దన్నం తింటుంటారు. తరువాత పనులకు వెళ్తుంటారు. ఇక్కడ చద్దన్నం అంటే రాత్రి మిగిలిన అన్నం కాదు. రాత్రి వండిన అన్నంలో మజ్జిగ కలిపి దాన్ని నానబెడతారు. తెల్లవారే సరికి అది పులుస్తుంది. దీంతో మంచి బాక్టీరియా తయారవుతుంది. ఈ క్రమంలో ఆ అన్నంలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు కలిపి తింటారు. అలా చద్దనాన్ని తింటారు. అయితే దీన్ని ఇప్పుడు ఎవరూ తినడం లేదు కానీ నిజానికి ఇది చాలా చక్కని ఆహారం అని చెప్పవచ్చు. రోజూ ఉదయాన్నే ఈ అన్నాన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
1. పైన తెలిపిన విధంగా చద్దన్నాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు తోడ్పాటు లభిస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు. అల్సర్లు తగ్గుతాయి.
2. ఉదయాన్నే చద్దన్నాన్ని తినడం వల్ల శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు.
3. సాధారణ తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను అన్నంలా వండి అందులో మజ్జిగ పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
4. చద్దన్నాన్ని తినడం వల్ల అలసట ఉండదు. శరీరానికి విటమిన్ బి12 లభిస్తుంది.
5. పాలిచ్చే తల్లులు ఈ అన్నాన్ని తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మలబద్దకం ఉన్నవారు ఈ అన్నాన్ని తింటే ఎంతో మేలు జరుగుతుంది.
6. చద్దన్నాన్ని తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365