Beetroot For Liver : మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీర్ణక్రియ, మెటబాలిజం, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం వంటి అనేక పనులను లివర్ సక్రమంగా జరిగేలా చూస్తుంది. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 25 శాతం మంది ఏదో ఒక లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, హెపటైటిస్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే లివర్ వ్యాధులు వచ్చినప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా లివర్ వ్యాధి బారిన పడితే అప్పుడు లివర్ చేసే పనులకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో మన శరీరం కొన్ని సంకేతాలు, లక్షణాలను మనకు చూపిస్తుంది. ముఖ్యంగా చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మం దురదలు పెట్టడం, మూత్రం ముదురు రంగులో రావడం, మలం పసుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో రావడం, పొట్ట దగ్గర ఉబ్బిపోయి ఉండడం, ఆకలి లేకపోవడం వంటి అనేక లక్షణాలు మనకు లివర్ వ్యాధుల కారణంగా కనిపిస్తాయి.
అయితే లివర్ వ్యాధులు వచ్చినవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. దీంతో వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. వారు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అలాగే రోజూ తీసుకునే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా లివర్‌ను క్లీన్ చేసే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఇక లివర్‌ను క్లీన్ చేసే ఆహారాల్లో బీట్‌రూట్ అతి ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఇది లివర్‌ను క్లీన్ చేయడమే కాకుండా లివర్ ఆరోగ్యానికి అవసరం అయిన ఎంజైమ్‌లను అందిస్తుంది. అలాగే లివర్ పనితీరు మెరుగుపడేందుకు సహాయం చేస్తుంది. కనుక బీట్‌రూట్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఇది రక్తాన్ని సైతం శుద్ధి చేస్తుంది. లివర్, రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోజూ బీట్‌రూట్ ముక్కలను ఒక కప్పు మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు తింటే మంచిది. లేదా పరగడుపునే బీట్‌రూట్ జ్యూస్‌ను అయినా తాగవచ్చు. దీన్ని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. అందులో నిమ్మరసం, అల్లం రసం కలిపితే ఇంకా మంచిది.
ఇలా బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. పలు రకాల లివర్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు.