Thyroid Foods : వీటిని తీసుకుంటే చాలు.. థైరాయిడ్ చాలా త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది..!

Thyroid Foods : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడిన‌ప్ప‌టికి థైరాయిడ్ స‌మస్య‌ పూర్తి స్థాయిలో త‌గ్గ‌దు. అలాగే వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. మందుల‌తో పాటు ఆహార నియ‌మాల‌ను పాటిస్తేనే ఈ స‌మ‌స్య పూర్తి స్థాయిలో అదుపులో ఉంటుంది. థైరాయిడ్ ను నియంత్రించే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మందుల వాడ‌కాన్ని మ‌నం కొద్ది కొద్దిగా త‌గ్గించ‌వ‌చ్చు. అలాగే ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ కూడా అదుపులో ఉంటుంది. థైరాయిడ్ ను నియంత్రించే ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ స‌మ‌స్య‌ను అదుపులో ఉంచ‌డంలో కొబ్బ‌రి నూనె మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉండ‌డంతో పాటు అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. రోజూ ఒక టీ స్పూన్ కొబ్బ‌రి నూనెను ఒక గ్లాస్ వేడి నీటిలో లేదా ఒక గ్లాస్ పాలల్లో క‌లిపి తాగాలి లేదా అన్నం మొద‌టి ముద్దలో క‌లిపి తీసుకోవాలి. ఇలా కొబ్బ‌రి నూనెను తీసుకోవ‌డం వల్ల థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది. అలాగే థైరాయిడ్ స‌మ‌స్య‌ను అదుపులో ఉంచ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ప్ర‌తిరోజూ ఒక క‌ప్పు పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది. అదే విధంగా కొత్తిమీర‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Thyroid Foods take these daily to control in no time
Thyroid Foods

వారానికి రెండు నుండి మూడుసార్లు 50 ఎమ్ ఎల్ కొత్తిమీర జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా అశ్వ‌గంధ చూర్ణాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఔష‌ధ గుణాలు థైరాయిడ్ ను అదుపులో ఉంచ‌డంలో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అల్లం టీ లో, తేనె, నిమ్మ‌ర‌సంతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది. అలాగే పాల‌కూర జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ ను మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు.

పాల‌కూర‌ను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. త‌రువాత దీనిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది. అదే విధంగా చేప‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది. అయితే చేప‌ల‌ను ఉడికించి మాత్ర‌మే తీసుకోవాలి. వీటిని నూనెలో వేసి వేయించి తీసుకోవ‌డం వ‌ల్ల చేప‌ల‌ను తిన్న‌ప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. అలాగే దాల్చిన చెక్క‌తో టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

అదే విధంగా క్యారెట్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా థైరాయిడ్ స‌మ‌స్య నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సలాడ్స్ లో లేదా క్యారెట్ ను జ్యూస్ గా చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం థైరాయిడ్ ను త‌గ్గించుకోవ‌చ్చు. థైరాయిడ్ స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలో ఉసిరికాయ కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ పొడిని లేదా జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. మందుల‌తో పాటు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా థైరాయిడ్ స‌మ‌స్య‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts