పూరీలు, పకోడీలు, బజ్జీలు, సమోసాలు.. వంటి నూనె పదార్థాలను తయారు చేసినప్పుడు మనం సహజంగానే వాడిన నూనెనే వాడుతుంటాం. బయట కూడా వీటిని తయారు చేసేవారు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అయితే నిజానికి వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఇలా వాడిన నూనెనే పదే పదే వాడడం మంచిది కాదట. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
వంట నూనెలను పదే పదే వేడి చేయడం వల్ల వాటిలో విష పదార్థాలు ఏర్పడుతాయి. అవి మన శరీరంలోకి వెళ్లగానే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. Food Safety and Standards Authority of India (FSSAI) చెబుతున్న ప్రకారం.. వంట నూనెలను పదే పదే వేడి చేయడం వల్ల వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ మూడింతలు పెరుగుతుంది. అది మనకు ఏమాత్రం మంచిది కాదు.
వంట నూనెను ఒకసారి బయటకు తీశాక ఒకసారి వాడితే అంతే.. దాన్ని మళ్లీ వేడి చేయడం, వాడడం చేయరాదు. వంట నూనెలను పదే పదే వేడి చేస్తూ వాడితే అలాంటి నూనె మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే బయటి ఆహారాలను తినరాదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
పదే పదే వేడి చేయబడిన వంట నూనెలను వాడడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను కలిగిస్తుంది. కనుక వంట నూనెలను ఒక్కసారి మాత్రమే వాడాలి. మళ్లీ మళ్లీ వేడి చేసి వాడరాదు.