కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.. అడ్డుకోవ‌డానికి ఈ సూచ‌న‌లు పాటించండి..

క‌రోనా వ‌చ్చిన వ్య‌క్తి ద‌గ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా వారి నుంచి వెలువ‌డే తుంప‌ర‌లు బ‌య‌ట‌ కొంత దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తాయి. ఆ స‌మ‌యంలో ఇత‌రులు ఎవ‌రైనా వాటిని పీల్చుకుంటే వారికి కోవిడ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే క‌న్నీళ్ల ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.. అడ్డుకోవ‌డానికి ఈ సూచ‌న‌లు పాటించండి..

కోవిడ్ వ‌చ్చిన వ్య‌క్తి క‌న్నీళ్ల‌ను ఎవ‌రైనా తాకితే వైర‌స్ వారికి కూడా వ్యాపించే అవ‌కాశాలు ఉంటాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డించారు. ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఆప్తాల్మాల‌జీలోనూ ఈ అధ్య‌య‌నం తాలూకు వివ‌రాల‌ను ప్ర‌చురించారు. అయితే కోవిడ్ వ‌చ్చిన వ్య‌క్తుల క‌న్నీళ్ల నుంచి మనం ర‌క్ష‌ణ‌గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* కోవిడ్ సోకినప్పుడు మీ కళ్ళు రుద్దడం మానుకోండి. తుమ్ముతున్నప్పుడు మీ నోరు, ముక్కును కవర్ చేయండి లేదా మీ మోచేయి లోపలి భాగాన్ని ఉపయోగించండి.

* ఉపయోగించిన టిష్యూలను చెత్తబుట్టలో వేయండి. వెంటనే మీ చేతులను సబ్బు నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోండి. సబ్బు నీరు తక్షణమే అందుబాటులో లేకపోతే కనీసం 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌తో మీ చేతులను శుభ్రం చేసుకోండి.

* కోవిడ్‌ సోకిన వ్యక్తుల చుట్టూ ఉంటే మీ కళ్ళు, ముక్కు, నోటిని చేతులతో తాకడం మానుకోండి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాల‌ను నివారించండి.

* త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. రోజూ తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రపరచండి. శానిటైజేష‌న్ చేయండి. దీని వ‌ల్ల కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చు.

Admin

Recent Posts