హెల్త్ టిప్స్

High Heels : ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

High Heels : నేటి తరుణంలో ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజసిద్ధ‌మైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన ఎక్కువ బరువును మడ‌మలపై మోపడం వల్ల పాదం ముందు భాగంపై అధికంగా ఒత్తిడి పడుతుంది.

శరీర బరువుంతా సమానంగా పంపిణీ అయ్యే వ్యవస్థను ఎత్తు మడ‌మల చెప్పులు దెబ్బ తీస్తాయి. దీని వల్ల పొట్ట ముందుకు, పిరుదులు వెనక్కి వాటంతట అవే కదులుతాయి. దీంతో వెన్నెముక కింది భాగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని కోల్పోతుంది. ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అసహజమైన పాదం ఆకృతి వల్ల కాలి పిక్కలు బాగా నొప్పి పుడతాయి. హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వేసుకుంటే ఏకిల్స్ టెండన్స్ (Achilles tendons) అనే రుగ్మతకు లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఆ చెప్పులకు బదులుగా సాధారణ చెప్పులు వేసుకున్నా పాదం నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. మామూలుగా నడిచినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. పాదంపై ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది.

what happens if women wear high heels

రోజూ హై హీల్స్ చెప్పులను ధరించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రధానంగా మడ‌మల వద్ద ఉండే కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. హై హీల్స్ చెప్పులతో బ్యాక్ పెయిన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చెప్పులు శరీర గురుత్వ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ వ‌స్తుంది. కొన్ని సందర్భాల్లో కాలి వేళ్లు నిస్సత్తువగా, స్తబ్దుగా మారుతాయి. అయితే దీన్ని పట్టించుకోకుండా అలాగే హై హీల్స్ చెప్పులను వాడితే అది కాలి వేళ్లలోని నరాలను శాశ్వతంగా దెబ్బ తీస్తుంది. హై హీల్స్ చెప్పుల వెనుక భాగంలో పదునుగా ఉండే స్ట్రిప్ పాదంపై 30 శాతం అదనపు ఒత్తిడిని కలగజేస్తుంది. ఇవి ఎంత ఎత్తుగా ఉంటే దాని వల్ల అంత అనారోగ్య సమస్య కలుగుతుంది. ప్రధానంగా మడ‌మలు, పిక్కలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి.

హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వాడితే శరీర వెన్నెముక తన సహజమైన షేప్‌ను కోల్పోతుంది. దీంతో బ్యాక్ కొద్దిగా వంగినట్టు అవుతుంది. దీని వల్ల శరీర ఆకృతిలో తేడా వస్తుంది. హై హీల్స్ వల్ల పాదం కండరాలు ఎక్కువగా దెబ్బ తింటాయి. కాళ్లు నొప్పులకు, బెణుకులకు గురవుతాయి. సో, ఫ్యాషన్ సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు వీటిని ధరించకపోవడమే ఉత్తమ‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఎత్తు మ‌డ‌మ‌ల చెప్పుల‌ను అస‌లు ధరించాదు. లేదంటే స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంది.

Admin

Recent Posts