హెల్త్ టిప్స్

Black Pepper : మీరు రోజూ తినే ఆహారంపై మిరియాల పొడి చ‌ల్లి తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Black Pepper : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మిరియాల‌ను త‌మ వంట ఇంటి దినుసులుగా ఉప‌యోగిస్తున్నారు. మిరియాల‌లో రెండు ర‌కాలు ఉంటాయి. న‌ల్ల మిరియాలు, తెల్ల మిరియాలు అని ఉంటాయి. మ‌నం న‌ల్ల మిరియాల‌ను సాధార‌ణంగా త‌రచూ ఉప‌యోగిస్తాం. అయితే ఆయుర్వేద ప్ర‌కారం మిరియాల‌లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. మిరియాల‌ను మ‌నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌నం రోజూ తినే ఆహారాల‌పై మిరియాల పొడి కాస్త చ‌ల్లి తిన‌వ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాల పొడిని ప‌సుపుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. క‌ళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అలాగే ఈ మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. అలాగే మిరియాల పొడిని రోజూ తిన‌డం వ‌ల్ల అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. ఇది కీళ్ల నొప్పులు, ఉన్న‌వారికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న‌వారు మిరియాల‌ను తీసుకుంటే ఎంతో ఉప‌యోగం ఉంటుంది. ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

what happens if you mix pepper powder with foods and eat

మిరియాల పొడిని ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల మీకు అస‌లు గ్యాస్ స‌మ‌స్య రానే రాదు. మీరు తినే ఆహారాలు కూడా సుల‌భంగా జీర్ణం అవుతాయి. అలాగే పొట్ట ఉబ్బ‌రం స‌మ‌స్య ఉండ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. పొట్ట‌, పేగుల్లో ఉండే పురుగులు చ‌నిపోతాయి. మిరియాల పొడిని తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మీకు ద‌గ్గు, జ‌లుబు రావు. జ్వ‌రం వ‌స్తే వెంట‌నే త‌గ్గుతుంది. ఇలా మిరియాల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటే మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది.

Admin

Recent Posts