హెల్త్ టిప్స్

మనం రోజూ వాడే బట్టల క్లిప్పులను చెవుల చివరల పెట్టుకుని 5 సెకన్లు ఉంచితే ఏమవుతుందో తెలుసా.?

బట్టలు ఆరేసేప్పుడు ఎగిరిపోకుండా క్లిప్స్ పెడతాం..మన పిల్లలు ఆ క్లిప్స్ తీసుకుని ముక్కుకి,చెవులకు పెట్టుకుని ఆడుతుంటారు..అది కానీ టైట్ గా పట్టేస్తే అమ్మా తీయ్ అంటు అరుస్తుంటారు..పిల్లలు సరదా పడడమే కాదు అప్పుడప్పుడు మనం కూడా ఏదో ఆలోచిస్తూ ఆ క్లిప్స్ ని చెవులకు ముక్కుకి పెట్టుకుంటుంటాం..మీరు సరదాకే ఆ విధంగా పెట్టుకున్నా కూడా అది మీకు మంచే చేస్తుంది..ఎలాగో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.. ఈ రోజుల్లో ప్రశాంతంగా బతుకుతున్న మనిషి కనపడడం చాలా అరుదు కానీ ఒత్తిడికి లోనవకుండా ఉన్న మనిషి ఉండడం అనేది అసంభవం.ఏదో ఒక వత్తిడి ..చదువుకునేప్పుడు మార్కులకోసం,చదువయ్యాక మంచి ఉద్యోగం కోసం,తర్వాత పెళ్లి,పిల్లలకోసం..ఆ తర్వాత మంచి జీవితం కోసం..ఒకటని కాదు ప్రతిది ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే ఈ పోటీ ప్రపంచంలో..

ఈ సారి మీరు ఒత్తిడి ఫీల్ అయితే బాడీ మసాజ్ బదులు చెవి రిఫ్లెక్సాలజీ (అసంకల్పిత ప్రతీకార చర్య) పద్ధతి పాటించండి.దానికోసం మీరు మీ చెవి భాగంలో ఒత్తిడిని తగ్గించే పాయింట్స్ కనిపెడితే సరి అంటున్నారు నిపుణులు.మీకంత టైం లేదనుకుంటే మీరు కొన్ని రిఫ్లెక్సాలజీ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మన విశ్రాంతికి తగిన కుర్చీ తీసుకుని, జుట్టును పాకి కట్టుకుని చెవి కమ్ములను కిందకు మీదకు చెవులను నొక్కితే సరిపోతుంది. అలా జాగ్రత్తగా చేసి మీ చెవి బాహ్య అంచులను కూడా కొంచెం సేపు అలాగే చేయండి. మీ చెవులను తాకినప్పుడు మిగతా శరీర భాగాలు నొప్పికి చికాకుకి గురవుతుంది. బాహ్య చెవిలోని ప్రతీ స్పాట్లో 5 సెకన్ల పాటు ఒత్తిడికి గురి చేసి ఒక్కో చెవికి 5సార్లు చేయాల్సి ఉంటుంది. చెవి భాగాల్లో మసాజ్ ద్వారా చాలా రకాల నొప్పులు, వ్యసనాలను తగ్గించుకోవచ్చని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. చెవి మెదడుకు దగ్గరగా ఉండడం వల్ల ఈ మసాజ్ బాగా పనిచేస్తుందని వైద్య నిపుణుడు రాన్దిగ్ చెబుతున్నారు.

what happens if you put cloth clips to ear

మీ బాహ్య చెవిలోని 6 ఒత్తిడి స్పాట్లను బట్టలు ఆరేసే క్లిప్పులతో బిగించి 5 సెకన్లపాటు ఉంచండి. అలా చెవి కమ్మలపై ఒత్తిడి ఉంచడం వల్ల తల నొప్పితో పాటు పొట్ట సమస్యలు సైనస్ సమస్యలు, వెన్ను, భుజాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. మేం చెప్పేది నమ్మకం కలగట్లేదా..సరే ముందు మీరు బట్టల క్లిప్స్ పెట్టకుండా మీకు తలనొప్పి వచ్చిన్పుడు చెవిని నొక్కి పట్టుకుంటూ ఉండండి ఎక్కడో ఒక దగ్గర మీకు ఒత్తిడిని తగ్గించే పాయింట్ తగులుతుంది.అక్కడ అలాగే గట్టిగా పట్టుకుంటే ఏదో రిలీఫ్ గా అనిపిస్తుంది..కావాలంటే ఈ సారి ట్రై చేయండి.

Admin

Recent Posts