హెల్త్ టిప్స్

Ajwain And Jaggery : వాము, బెల్లం క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Ajwain And Jaggery : వాముని మనం వంటల్లో వాడుతూ ఉంటాము. వాము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను, వాము దూరం చేస్తుంది. వాము తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. వాముని తీసుకుంటే వికారం, వాంతులు సమస్య నుండి కూడా సులభంగా బయటకు వచ్చేయొచ్చు. వాము వలన బరువు కూడా తగ్గొచ్చు. ఎన్నో వ్యాధుల నుండి వాము మనల్ని రక్షించగలదు.

అయితే వాము, బెల్లం కలిపి తీసుకుంటే కూడా చక్కటి లాభాలను పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి, పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి వంటివి ఉండవు. వాము, బెల్లం కలిపి ఆస్తమా తో బాధపడే వాళ్ళు తీసుకుంటే, ఆస్తమా బాగా తగ్గుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో వాము వేసుకుని, చిన్న బెల్లం ముక్క ని కలిపి తీసుకున్నట్లయితే, ఉపశమనం లభిస్తుంది.

what happens if you take vamu and bellam

వెన్నునొప్పి, శారీరక నొప్పుల నుండి రిలీఫ్ ని పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవాళ్లు, వాము బెల్లాన్ని తీసుకోవడం మంచిది. శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది.

ఈ రెండింటినీ ఎక్కువగా తీసుకోకండి. లిమిట్ గా తీసుకోండి. ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే, వేడి చేసే గుణం అధికంగా ఉండడం వలన తల తిరగడం లేదంటే వాంతులు వంటివి కల‌గవచ్చు. ఆహార పదార్థాలని అధిక తీసుకుంటే, కచ్చితంగా నష్టాలు ఉంటాయి. ఏ ఆహార పదార్థాలను అయినా కూడా సరైన మోతాదులోనే తీసుకోవాలి. మోతాదుకి మించి తీసుకోవడం వలన నష్టాలు వస్తాయి. కాబట్టి, ఆ పొరపాట్లు చేయకండి.

Share
Admin

Recent Posts