Dates : ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు.. ఈ స‌మ‌యంలో తినండి.. ఎక్కువ లాభం క‌లుగుతుంది..!

Dates : ఖర్జూరాలు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది స్వీట్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. కొంద‌రు రోజూ నేరుగానే ఖ‌ర్జూరాల‌ను తింటుంటారు. ఇవి త‌క్ష‌ణ శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు.. అనేక పోష‌కాల‌ను కూడా ఇస్తాయి. అందువ‌ల్ల ఖ‌ర్జూరాలను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజులో ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌ద‌ని.. నిర్దిష్ట‌మైన స‌మ‌యాల్లోనే వీటిని తినాలని.. దీంతో ఇంకా ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఖ‌ర్జూరాల‌ను తినేందుకు సరైన స‌మ‌యం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖ‌ర్జూరాల‌ను సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్‌లా తింటే ఎంతో మంచిది. ఎందుకంటే మ‌ధ్యాహ్నం 12 నుంచి 1 గంట మ‌ధ్య‌లో భోజ‌నం చేసే వారికి సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల స‌మ‌యంలో ఆక‌లి వేస్తుంది. ఆ స‌మ‌యంలో భోజ‌నం చేయ‌లేరు. క‌నుక స్నాక్స్ తింటారు. అలాంట‌ప్పుడు చాలా మంది నూనె వస్తువులు లేదా బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువగా తింటుంటారు. వాటికి బ‌దులుగా ఐదారు ఖ‌ర్జూరాల‌ను తినాలి. దీంతో త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహం పుంజుకుంటారు. మ‌ళ్లీ త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీంతో బ‌రువు పెరుగుతామ‌న్న భ‌యం ఉండ‌దు. క‌నుక ఖ‌ర్జూరాల‌ను సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా తిన‌డం ఉత్త‌మం అని చెప్ప‌వ‌చ్చు.

what is the best time to take dates know it
Dates

జిమ్‌కు వెళ్లేవారు లేదా శారీర‌క శ్ర‌మ చేసేవారు, వ్యాయామం చేసే వారు ఆ ప‌నుల‌కు చేయ‌డానికి ముందు ఖ‌ర్జూరాల‌ను తినాలి. దీంతో శ‌క్తి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. త్వ‌రగా అల‌సిపోరు. మ‌రింత ఎక్కువ వ్యాయామం చేసేందుకు లేదా ప‌ని చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు క్యాల‌రీలు కూడా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గేందుకు చాన్స్ ఉంటుంది. వ్యాయామం లేదా జిమ్ ఏదైనా ప‌ని చేసేందుకు క‌నీసం 30 నిమిషాల ముందు నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను తినాలి. దీంతో ఎక్కువ మేలు క‌లుగుతుంది.

ఇక జిమ్ లేదా వ్యాయామం, ఏదైనా ప‌ని చేసిన త‌రువాత కూడా వెంట‌నే ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో శ‌క్తిని తిరిగి పుంజుకుంటారు. అల‌స‌ట త‌గ్గి ఉత్సాహం వ‌స్తుంది. మళ్లీ సుల‌భంగా పనులు చేసుకోగ‌లుగుతారు. అలాగే కండ‌రాలు కూడా త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతాయి. దీంతోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పొటాషియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ల‌భిస్తాయి. ఇవి శ‌రీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. క‌నుక జిమ్ లేదా వ్యాయామం అనంత‌రం వెంట‌నే కూడా ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. ఇలా తిన్నా ఎక్కువ లాభ‌మే క‌లుగుతుంది.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలోనూ ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు ఉద‌య‌మే ల‌భిస్తాయి. దీని వ‌ల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. చురుగ్గా ప‌నిచేస్తారు. నీర‌సం, అల‌స‌ట ఉండ‌వు. ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఉప‌వాసం ముగిసిన అనంత‌రం వెంట‌నే భోజ‌నం చేయ‌కుండా ఖ‌ర్జూరాల‌ను తినాలి. దీంతో శ‌రీరానికి త్వ‌రగా శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. ఉప‌వాసం నుంచి త్వ‌రగా కోలుకుంటారు. కాబ‌ట్టి ఉప‌వాసం విడిచిన వెంట‌నే కూడా ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు.

అయితే ఖ‌ర్జూరాలను తిన‌డం మంచివే అయిన‌ప్ప‌టికీ రోజుకు ఐదారు మించి తిన‌రాదు. తింటే వేడి చేస్తుంది. క‌నుక పైన చెప్పిన స‌మ‌యాల్లో ఏదైనా ఒక్క స‌మ‌యంలో మాత్ర‌మే ఖ‌ర్జూరాల‌ను తీసుకోవాలి. లేదంటే దుష్ప‌రిణామాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక పైన తెలిపిన ఏదైనా ఒక్క స‌మయంలోనే వాటిని తింటే ఎంతో లాభం పొంద‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Share
Editor

Recent Posts