హెల్త్ టిప్స్

Radish : ముల్లంగిని అంత తేలిగ్గా తీసుకోకండి.. దీంతో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే షాక‌వుతారు..!

Radish : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ముల్లంగి కూడా ఒక‌టి. ఇది రెండు ర‌కాలుగా ల‌భిస్తుంది. ఒక‌టి తెలుపు రంగులో ఉండే ముల్లంగి కాగా మ‌రొక‌టి పింక్ రంగులో ఉండే ముల్లంగి. దీన్నే ఎర్ర ముల్లంగి అని కూడా పిలుస్తారు. మ‌న‌కు ఎక్కువ‌గా తెలుపు ముల్లంగి ల‌భిస్తుంది. ముల్లంగితో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. కొంద‌రు దీన్ని ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. దీన్ని ఎక్కువ‌గా చాలా మంది సాంబార్‌లో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ముల్లంగి అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. కూర‌ల్లో వ‌చ్చినా ఏరి ప‌క్క‌న ప‌డేస్తారు. కానీ ముల్లంగితో మ‌న‌కు అనేక అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముల్లంగిని రోజూ తీసుకున్నా లేక దీని జ్యూస్‌ను రోజూ కొద్దిగా తాగుతున్నా అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను నిరోధిస్తాయి. క్యాన్స‌ర్ ఉన్న‌వారికి ముల్లంగి ఒక వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ముల్లంగిలో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా ప‌నిచేస్తుంది. ఇది క‌ణాల వినాశ‌నాన్ని అడ్డుకుంటుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ర‌క్త‌నాళాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాదు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

wonderful health benefits of radish

ముల్లంగిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే విష‌యం. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. ముల్లంగిలో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని త‌గ్గిస్తాయి. గుండె పోటు, గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి. ముల్లంగిలో ఉండే ఆంథోస‌య‌నిన్లు హైబీపీని త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. అలాగే ర‌క్త‌నాళాలు వాపుల‌కు గురి కాకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.

ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఊబ‌కాయాన్ని త‌గ్గిస్తుంది. బ‌రువు త‌గ్గించ‌డంలో ముల్లంగి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేలా చేస్తుంది. ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇలా ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. క‌నుక ఇక‌పై మార్కెట్‌లో ఎక్క‌డ ముల్లంగి క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి. దీన్ని తీసుకుంటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts