హెల్త్ టిప్స్

నాన్‌వెజ్ తినలేరా..? విటమిన్ బి12 ఉండే వెజ్ ఆహారాలు ఇవే..!

శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…

* పాలను నిత్యం తాగితే మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 20 శాతం వరకు పొందవచ్చు. పాలు విటమిన్ బి12కు మంచి సోర్స్ అని చెప్పవచ్చు.

* పెరుగులోనూ విటమిన్ బి12 మనకు లభిస్తుంది. నిత్యం పెరుగును తినడం వల్ల మనకు కావల్సిన విటమిన్ బి12లో 51 నుంచి 79 శాతం వరకు ఆ విటమిన్‌ను పొందవచ్చు.

you can take these vitamin b12 veg foods

* 30 గ్రాముల చీజ్‌లో నిత్యం మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 36 శాతం వరకు పొందవచ్చు.

* బాదంపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, బెండకాయలు, అవకాడోలు, ఉల్లిపాయలు తదితర ఆహారాల్లోనూ మనకు కావల్సినంత విటమిన్ బి12 దొరుకుతుంది.

ఇక ఎవరికైనా వారి వయస్సును బట్టి నిత్యం నిర్దిష్టమైన మోతాదులో విటమిన్ బి12 అవసరం అవుతుంది. ఈ క్రమంలో 1 నుంచి 3 ఏళ్ల లోపు వారికి నిత్యం 0.9 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది. అలాగే 4 నుంచి 8 ఏళ్ల వారికి 1.2 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల వారికి 1.8 మైక్రోగ్రాములు, ఆపై వయస్సుల వారికి నిత్యం 2.4 మైక్రోగ్రాములు, శిశువులకు 0.5 మైక్రోగ్రాములు, గర్భిణీలకు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు నిత్యం 2.8 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది.

Admin

Recent Posts