Phone : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రించే వరకు స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది సోషల్ మీడియాలో ఎక్కువగా విహరిస్తున్నారు. ఇక కొందరు గేమ్స్ ఆడుతుంటే.. కొందరు సినిమాలు చూడడం.. ఇంకొందరు పాటలు వినడం చేస్తున్నారు. ఇలా చాలా మంది ఫోన్లను అన్ని రకాల పనులకు వినియోగించుకుంటున్నారు. అయితే కొందరు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో టాయిలెట్‌లో ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి ఈ అలవాటు అసలు ఏమాత్రం మంచిది కాదని.. దీని వల్ల దుష్పరిణామాలు కలుగుతాయని.. అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇక ఫోన్లను టాయిలెట్లలో ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్లను టాయిలెట్లలో ఉపయోగించడం వల్ల వాటిపై టాయిలెట్‌లో ఉండే క్రిములు చేరతాయి. తరువాత అవి మన చేతుల నుంచి శరీరం లోపలి వరకు వెళ్తాయి. దీంతో అవి జీర్ణ సమస్యలను కలగజేస్తాయి. ముఖ్యంగా విరేచనాలు అవుతాయి. అలాగే వాంతులు కూడా చేసుకుంటారు. దీంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి. కనుక ఎవరైనా ఈ విధమైన సమస్యలను ఎదుర్కొంటుంటే వారు ఫోన్లను టాయిలెట్లలో ఉపయోగిస్తున్నారో.. లేదో.. పరిశీలించుకోవాలి. ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. లేదంటే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి.
ఇక టాయిలెట్లలో ఫోన్లను ఉపయోగించడం వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మలబద్దకం, పైల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే మన శరీరంలోకి ఫోన్ మీద ఉండే అనేక క్రిములు ప్రవేశిస్తాయి. ఇవి అనేక రోగాలను కలగజేస్తాయి. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా రాను రాను తగ్గుతుంది. దీంతో శరీరంపై మరిన్ని క్రిములు దాడి చేసి మనల్ని అనారోగ్యాలకు గురి చేస్తాయి. అప్పుడు కోలుకోలేని దెబ్బ పడుతుంది. కనుక ఫోన్లను టాయిలెట్లలో ఉపయోగించే అలవాటు ఉన్నవారు దాన్ని వెంటనే మార్చుకోవాలని.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు ఆ అలవాటును వెంటనే మానేయండి. లేదంటే చివరకు ప్రాణాంతకమే అవుతుంది. అప్పుడు బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.