Chyawanprash : అనేక వ్యాధుల‌కు చెక్ పెట్టే చ్య‌వ‌న్‌ప్రాశ్.. ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోండిలా..!

Chyawanprash : ప్ర‌స్తుతం మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జం అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌స్య‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే మ‌న‌కు సంభ‌వించే అనేక ర‌కాల వ్యాధులు రోగ నిరోధ‌క శ‌క్తి స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. దీంతోపాటు జీర్ణ‌క్రియ న‌శించ‌డం కూడా వ్యాధులు వ‌చ్చేందుకు ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. కానీ రోజువారీ దిన‌చ‌ర్య‌లో భాగంగా చ్య‌వ‌న్‌ప్రాశ్‌ను తీసుకుంటే ఈ స‌మ‌స్య‌లు ఉండ‌వు. దీంతో వ్యాధుల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Chyawanprash can stop many diseases know how to prepare it at your home

చ్య‌వ‌న్‌ప్రాశ్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. అయితే కొంచెం ప‌డితే దీన్ని ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

చ్య‌వ‌న్ ప్రాశ్ మంచి ర‌సాయ‌న ఔష‌ధం. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, వృద్ధాప్య‌ ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గా రాకుండా కాపాడుతుంది. దీని త‌యారీలో దాదాపుగా 45 నుంచి 50 ర‌కాల మూలిక‌లు వినియోగిస్తారు. ఇంటి వ‌ద్ద దీన్ని త‌యారు చేసుకోవ‌డం క‌ష్టం. ఇందులో ప్ర‌ధానంగా వాడే మూలిక ఉసిరికాయ. దీన్ని ఉత్తమ ర‌సాయ‌నం అంటారు. దీనికి తేలిక‌గా ల‌భ్య‌మ‌య్యే మ‌రికొన్ని మూలిక‌ల‌ను క‌లిపి ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అదెలాగంటే..

కావ‌ల‌సిన‌వి : ఉసిరికాయ‌లు – 50, వెదురు ఉప్పు – 20గ్రా., పిప్ప‌ళ్ల చూర్ణం – 10గ్రా., దాల్చిన చెక్క పొడి – పావు చెంచా, యాల‌కుల పొడి – పావు చెంచా , తేనె – 30 గ్రా., నెయ్యి – 30గ్రా., నువ్వుల నూనె – 30గ్రా., చ‌క్కెర -250గ్రా. తీసుకోవాలి.

త‌యారు చేసే విధానం : ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి ప‌లుచ‌ని వ‌స్త్రంలో మూట కట్టి, కుక్క‌ర్ లో ఆవిరిపై ఉడికించాలి. మెత్త‌గా ఉడికిన త‌రువాత స్టీలు జ‌ల్లెడ‌లో వేసి చేతితో రుద్దితుంటే గింజ‌లు, పీచు పైన ఉండిపోయి, మెత్త‌టి గుజ్జు కింద‌కి వ‌స్తుంది. ఆ త‌రువాత పాత్ర‌ను తీసుకుని వేడి చేసి నువ్వుల నూనె, నెయ్యి వేసి, ఉసిరికాయ గుజ్జును అందులో వేసి.. బాగా ఉడికించాలి. వేరే గిన్నెలో చ‌క్కెర పాకం ప‌ట్టి, వేయించిన గుజ్జును వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత చ‌ల్లార్చి తేనె, వెదురు ఉప్పు, పిప్ప‌ళ్ల చూర్ణం, దాల్చిన చెక్క పొడి, యాల‌కుల పొడి క‌లిపి శుభ్ర‌మైన గాజు సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

ఉసిరి కాయ‌లు యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేస్తాయి. దీంతో శ‌రీరంలో వ్యాధికార‌కాలు, మ‌లినాలు చేర‌కుండా కాపాడ‌తాయి. ఇలా త‌యారు చేసుకున్న ఈ చ్య‌వ‌న్ ప్రాశ్ ను 5 నుంచి 10 గ్రాముల ప‌రిమాణంలో ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి క‌నీసం గంట ముందు తీసుకోవాలి. వెంట‌నే అర‌క‌ప్పు గోరువెచ్చ‌ని పాలు లేదా నీళ్లు తాగాలి. ఈ విధంగా క‌నీసం ఏడాది పాటు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎల్ల‌ప్పుడూ రోజూ తీసుకున్నా న‌ష్ట‌మేమీ ఉండ‌దు. అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Share
D
Published by
D

Recent Posts