Ginger Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి పదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంను తరచూ మనం వంటల్లో వాడుతుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లేదా మసాలా వంటలను చేసినప్పుడు అల్లం కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఆయా వంటలకు రుచిరాదు. అయితే కేవలం వంటలకే కాదు.. అల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే అల్లం టీని ఎలా తయారు చేయాలి.. దాన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల నీళ్లను పోయాలి. అనంతరం రెండు చిన్న అల్లం ముక్కలను వేసి నీళ్లను బాగా మరిగించాలి. నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి. అనంతరం అందులో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీంతో అల్లం టీ తయారవుతుంది. దీన్ని రోజూ పరగడుపునే తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అల్లం టీ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే వికారం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి. హైబీపీ ఉన్నవారు అల్లం టీ తాగితే బీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో ఉండే వాపులు తగ్గుతాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు వ్యాధులను తగ్గిస్తాయి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు ఈ టీని తాగితే త్వరగా కోలుకుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
ఈ టీని తాగడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇక ఈ టీని స్త్రీలు రుతు సమయంలో తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా అల్లం టీతో మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజూ పరగడుపునే తాగాలి.