Dengue : ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. డెంగ్యూ రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు..

Dengue : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి విష జ్వ‌రాలు వ‌స్తున్నాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డెంగ్యూ వ్యాధి కూడా బాగా ప్ర‌బ‌లుతోంది. ఇది దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. కుటుంబంలో ఒక‌రికి డెంగ్యూ వ‌స్తే.. మిగిలిన వారికి కూడా డెంగ్యూ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఎందుకంటే దోమ‌లు బాగా ఉంటాయి క‌నుక కుటుంబంలో వ‌రుస‌గా డెంగ్యూ బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిన్న‌పాటి జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే.. డెంగ్యూ రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు. దీంతో హాస్పిట‌ల్స్ చుట్టూ తిరిగే బాధ త‌ప్పుతుంది. ఇక డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

take these precautions early to prevent dengue
Dengue

డెంగ్యూ వ‌చ్చేందుకు దోమ‌లు కార‌ణ‌మ‌వుతాయి. క‌నుక దోమ‌లు లేకుండా చేయాలి. ఇందుకు గాను నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అలాగే శ‌రీరానికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి రాసుకోవడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు. దీంతో దోమ‌లు కుట్టకుండా ఉంటాయి. అలాగే దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటీకిటీలు, తలుపులు మూసి ఉంచాలి. బయట తిండి తినకపోవడమే మేలు. ఫిల్టర్ చేసిన, కాచి వ‌డబోసిన నీళ్లనే మాత్రమే తాగాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ‌లేకుండా చూడాలి. పరిసరాల్లో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూడాలి. ఇందులో నిల్వ ఉన్న నీటిలోనే డెంగీ దోమలు పెరుగుతాయి. ఇంటి మిద్దెలపై పాత సామాను ఉంటే తీసేయాలి. దోమ‌లు పెరిగేందుకు కార‌ణ‌మ‌య్యే అన్నింటినీ తీసేయాలి. దీంతో దోమ‌ల‌ను నియంత్రించ‌వ‌చ్చు.

అలాగే ఇంటి మూలల్లో చీకటిలో డెంగీ దోమలు ఉంటాయి. అలాంటి ప్రాంతాలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని నిల్వ చేస్తే వాటిపై మూతలు పెట్టాలి. వారానికి ఒక రోజు ఆ నీటిని పారబోసి పూర్తిగా ఆరబెట్టాలి. అలాగే దోమల నియంత్రణకు ఫాగింగ్ అవసరం. మీ ప్రాంతంలో మునిసిపల్ అధికారులను ఫాగింగ్ చేయమని మీరు ఒత్తిడి తేవాలి. వారు చేయకపోతే.. పై అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదా ఇంట్లోనే దోమ‌ల‌ను నివారించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి. ఇంట్లో వెల్లుల్లి ర‌సాన్ని లేదా వేపాకుల ర‌సాన్ని స్ప్రే చేస్తే దోమ‌లు రావు. వేపాకుల‌తో పొగ వేసినా దోమ‌లు పోతాయి. ఇలాంటి చిట్కాల‌ను, జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించ‌వ‌చ్చు. దీంతో దోమ‌లు కుట్టవు. ఫ‌లితంగా డెంగ్యూ రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు.

Editor

Recent Posts