Mustard : వంట‌ల్లో వాడే ఆవాలు మ‌న‌కు ఇంత మేలు చేస్తాయా.. ఇన్నాళ్లూ తెలియ‌లేదే..

Mustard : ఆవాల‌ను మ‌నం స‌హ‌జంగానే రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. మామిడి కాయ ప‌చ్చ‌డి పెడితే అందులో ఆవ పిండి వేస్తారు. ఆవాలు లేదా ఆవ పిండిని వంట‌ల్లో వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి ఆయుర్వేదం ప్ర‌కారం ఆవాలు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఆవాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజనాలు పొంద‌వ‌చ్చు. వీటితో ప‌లు వ్యాధులు న‌యం అవుతాయి. ఆవాల‌తో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Mustard
Mustard

ఆవాల‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి తెల్ల ఆవాలు కాగా.. రెండోది న‌ల్ల ఆవాలు. మ‌నం న‌ల్ల ఆవాల‌ను వాడుతాం. అయితే రెండూ మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. రెండింటి వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఆవాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, బీటా కెరోటిన్‌, విట‌మిన్లు ఎ, బి1, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కెల‌తోపాటు జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. క‌నుక ఆవాల‌ను తీసుకుంటే మ‌న‌కు అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి.

ఇక ఆవాల పొడిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. ముఖ్యంగా మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. అలాగే బెల్లంలో కొన్ని పల్లీలు, ఆవాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆపై వాటిని ఉండల్లా చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజుకు ఒకటి తీసుకుంటే ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చు. ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది. ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.

50 గ్రాముల‌ ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి, ఒక టీస్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే అస్తమా, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. ఆవాల పొడిని కడుపు ప్రాంతంలో రాసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఎక్కువగా వాంతులు, నీళ్ల‌ విరేచనాలవుతుంటే ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆవాల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts