Dry Coconut Milk : దీన్ని వారంలో మూడు సార్లు తీసుకోండి.. దెబ్బకు కీళ్ల నొప్పులు, నీరసం, నరాల బలహీనత తగ్గుతాయి..

Dry Coconut Milk : వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనికి తోడు నీరసంగా కూడా ఉంటుంది. ఇక కొందరికి అయితే నరాల బలహీనత కూడా వస్తుంది. అయితే ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే కింద తెలిపిన విధంగా ఓ చిట్కాను పాటించడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ చిట్కా ఏమిటంటే..

స్టవ్‌ మీద పాత్ర పెట్టి అందులో ఒక టీస్పూన్‌ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా గసగసాలు వేసి వేయించాలి. తరువాత అందులో ఒక గ్లాస్‌ పాలను పోయాలి. పాలు కొద్దిగా వేడి కాగానే అందులో అర టీస్పూన్‌ సోంపు, రుచికి సరిపడా పటిక బెల్లం వేయాలి. తరువాత అర టీస్పూన్‌ ఎండు కొబ్బరి తురుము వేయాలి. దీన్ని 8 నిమిషాల పాటు మరిగించాలి. పాలు బాగా మరిగాక స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తరువాత పాలు గోరు వెచ్చగా అయ్యాక వాటిని అలాగే తాగేయాలి.

Dry Coconut Milk drink can help you get rid of joint pain and weakness
Dry Coconut Milk

ఇలా పైన తెలిపిన విధంగా పాలతో మిశ్రమాన్ని తయారు చేసి వారంలో కనీసం మూడు సార్లు తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. దీంతోపాటు కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే కీళ్ల నొప్పులు, నీరసం, అలసట, నరాల బలహీనత వంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి.

గసగసాలలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరానికి కాల్షియం బాగా లభిస్తుంది. దీంతోపాటు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపులో ఉండే కాల్షియం, విటమిన్లు, ఐరన్‌, మెగ్నిషియం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక ఈ మిశ్రమాన్ని వారంలో మూడు సార్లు తాగితే ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Editor

Recent Posts