Pain Relief Juice : ఎలాంటి నొప్పిని అయినా సరే తగ్గించే జ్యూస్‌.. ఇలా తయారు చేసుకోండి..!

Pain Relief Juice : ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సహజంగానే నొప్పులు వస్తుంటాయి. కీళ్లు బాగా నొప్పిగా ఉంటాయి. చలికాలంలో ఈ నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇక కొందరికి శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేయడం.. వంటి పలు ఇతర కారణాల వల్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా ఓ డ్రింక్‌ను సిద్ధం చేసుకుని రోజూ తాగితే దాంతో ఎలాంటి నొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి ? అంటే..

Pain Relief Juice drink everyday make juice in this way

ఒక కప్పు కీర దోస ముక్కలు, అర కప్పు పైనాపిల్‌ ముక్కలు, సగం నిమ్మకాయ, ఒక కప్పు కొబ్బరినీళ్లు.. అన్నింటినీ తీసుకోవాలి. కీరదోసముక్కలు, పైనాపిల్‌ ముక్కలపై సగం నిమ్మకాయను పూర్తిగా పిండాలి. అనంతరం అందులో కొబ్బరినీళ్లను కలపాలి. తరువాత మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. దీన్ని ఒక కప్పు ఉదయం, ఒక కప్పు సాయంత్రం తీసుకోవాలి.

రోజూ ఈ విధంగా జ్యూస్‌ను తయారు చేసుకుని తాగుతుంటే శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ జ్యూస్‌లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శక్తి కూడా అందుతుంది.

Share
Admin

Recent Posts