Heart Health : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారాలు, పాటిస్తున్న జీవన విధానం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎప్పటికీ గుండె ఉక్కులా పనిచేస్తుంది. దీంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. మరి రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..
1. రోజువారిగా తీసుకుంటే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 25 శాతం మేర తగ్గించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకని రోజూ అవిసె గింజలు, చేపలు, బాదంపప్పు వంటి వాటిని తింటుంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు దినుసులు, బీన్స్, పచ్చి బఠానీలను రోజూ తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది.
3. చిరు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్ రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. కొబ్బరినీళ్లను తాగడం వల్ల పొటాషియం లభిస్తుంది. ఇది రక్తసరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది.
5. ఆకుకూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.