Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

Healthy Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. కీళ్ల నొప్పులు, నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి.. వంటి త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ రెండు టీ స్పూన్ల నువ్వుల‌ను, 2 టీ స్పూన్ల గ‌స‌గ‌సాల‌ను, 8 బాదం ప‌ప్పుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక జార్ లో నువ్వులు, గ‌స‌గ‌సాలు, బాదం ప‌ప్పుల‌ను తీసుకుని పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని పిల్ల‌ల‌కు ఒక టీ స్పూన్ మోతాదులో, పెద్ద‌వారు రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని పాల‌తో లేదా నీళ్ల‌తో తీసుకోవ‌చ్చు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఆవు పాల‌ను తీసుకుని వేడి చేయాలి. పాలు వేడ‌య్యాక ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి క‌లపాలి. త‌రువాత పాల‌ను మ‌రో 3 నిమిషాల పాటు మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి.

Healthy Drink preparation method take daily at night
Healthy Drink

పాలు చ‌ల్లారిన త‌రువాత రుచికి త‌గినంత బెల్లాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను రోజూ ఉద‌యం అల్పాహారంలో భాగంగా లేదా రాత్రి ప‌డుకునే ముందు తీసుకోవాలి. వీటిలో గ‌స‌గ‌సాలు వేసాము క‌నుక నిద్ర వ‌చ్చే అవ‌కాశం ఉంది. కావున రాత్రి స‌మ‌యంలో తీసుకోవ‌డం ఉత్త‌మం. బెల్లానికి బ‌దులుగా ఇందులో ప‌టిక బెల్లాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఇక పాలు ఇష్టం లేని వారు ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో గోరు వెచ్చ‌ని నీళ్ల‌ల్లో వేసి క‌లిపి తాగాలి. ఈ విధంగా రోజూ రాత్రి పాల‌తో క‌లిపి ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌గా నిద్ర వ‌స్తుంది.

నిద్ర లేమి స‌మ‌స్య దూరం అవుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో క్యాల్షియం లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఈ విధంగా నువ్వులు, గ‌స‌గ‌సాలు, బాదం ప‌ప్పును పొడిగా చేసుకుని పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య సమ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts