Weight Loss Drink : ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో పొట్ట, పిరుదులు, తొడలు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు అలాగే శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మారిన జీవన విధానం అలాగే ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మనం వికారంగా కనబడడంతో పాటు మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంది.
కనక మనం సాధ్యమైనంత త్వరగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అధిక బరువు, అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నవారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యవంతంగా పొట్టను, శరీర బరువును తగ్గించాలనుకునే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక కీరదోసను తీసుకోవాలి. తరువాత గుప్పెడు కొత్తిమీరను, ఒక ఇంచు అల్లాన్ని, ఒక నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఈ పదార్థాలన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా కీరదోసను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో కీరదోస ముక్కలను, కొత్తిమీరను, అల్లాన్ని, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తాగాలి. ఇలా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ పానీయాన్ని తీసుకున్న వారం రోజుల్లోనే మన శరీరంలో వచ్చే మార్చును మనం గమనించవచ్చు. ఈ విధంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.