Carrot Laddu : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన క్యారెట్ ల‌డ్డూ.. రోజుకు ఒక‌టి తింటే చాలు..!

Carrot Laddu : మ‌నం వంటింట్లో అధికంగా వాడే దుంప జాతికి చెందిన వాటిల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కంటి చూపుతోపాటు క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డ‌వం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ క్యారెట్ ల‌లో ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ లు రాకుండా చేయ‌డంతోపాటు, గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలోనూ క్యారెట్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Carrot Laddu is very healthy to us eat daily one
Carrot Laddu

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని, జీర్ణ క్రియ‌ను, మూత్ర పిండాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో క్యారెట్ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. త‌ర‌చూ క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ ను నేరుగా చాలా మంది తింటూ ఉంటారు. క్యారెట్ ముక్కల‌ను లేదా క్యారెట్ తురుముతో మ‌నం వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో ఎంతో రుచిగా, చాలా సులువుగా ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యారెట్ ల‌తో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యారెట్ తురుము – 500 గ్రా., ప‌చ్చి కొబ్బ‌రి త‌రుము – 100 గ్రా., పంచ‌దార – 200 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, పుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

క్యారెట్ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక జీడిప‌ప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత వీటిని ఒక ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో క్యారెట్ తురుమును వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చి కొబ్బ‌రి తురుమును కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాల త‌రువాత మూత తీసి పంచ‌దార‌ను వేసి పంచ‌దార పూర్తిగా క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత పుడ్ క‌ల‌ర్ ను వేసి క‌లిపి 10 నిమిషాల పాటు ఉంచాలి.

ఇప్పుడు యాల‌కుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిప‌ప్పు, ఎండు ద్రాక్ష‌ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చల్లారిన త‌రువాత కావ‌ల్సిన ప‌రిమాణంలో ల‌డ్డూల‌లా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఇలా చేసుకున్న ల‌డ్డూను రోజూ ఒక‌టి లేదా రెండిటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యారెట్, ప‌చ్చి కొబ్బ‌రిల‌ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క్యారెట్ ను ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాలు తొల‌గిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను కూడా క్యారెట్ క‌లిగి ఉంటుంది. చిగుళ్లు, దంతాల సమ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి.

Share
D

Recent Posts