Oats : అధిక బ‌రువును త‌గ్గిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచే ఓట్స్‌.. రోజూ ఇలా తినండి..!

Oats : అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు.. గుండె ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకునే వారికి.. ఓట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంప‌డం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు ఓట్స్ అందిస్తాయి.

here it is how you can prepare oats and eat daily

అయితే ఓట్స్ అందించే ప్ర‌యోజ‌నాలు చాలానే ఉన్నాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియ‌దు. ఓట్స్‌ను ఉప్మాలా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా వాటిలో వేడి పాలు పోసి 5 నిమిషాలు ఉంచి త‌రువాత తిన‌వ‌చ్చు. అందులో బాదంప‌ప్పు, పిస్తా, వాల్ న‌ట్స్ లేదా అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు.. వంటి సీడ్స్ ను క‌లిపి తిన‌వ‌చ్చు.

ఇక ఓట్స్‌ను ఉడ‌క‌బెట్టి అందులో పండ్ల‌ను స‌లాడ్ ముక్క‌ల్లా వేసి కూడా తిన‌వ‌చ్చు. ఈవిధంగా ఓట్స్ ను ర‌క‌ర‌కాలుగా తీసుకోవ‌చ్చు. అందువ‌ల్ల ఓట్స్ ను రోజూ ఒకేలా కాకుండా భిన్న ర‌కాలుగా వండుకుని తిన‌వ‌చ్చు. దీంతో వాటిని తిన‌డం బోర్ కొట్ట‌కుండా ఉంటుంది.

ఓట్స్ ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వస్థ ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. అసిడిటీ, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. ఓట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts