Health Tips : రోజుకు 3 సార్లు లేదా 6 సార్లు.. ఎన్ని సార్లు భోజ‌నం చేస్తే మంచిది ?

Health Tips : భోజ‌నం అనేది కొంద‌రు భిన్న ర‌కాలుగా చేస్తుంటారు. కొంద‌రు రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్ చేస్తారు. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ తింటారు. ఇక కొంద‌రు నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తారు. ఉద‌యం ఏమీ తిన‌రు. ఇలా ఒక్కొక్క‌రూ త‌మ‌కు అనుకూల‌మైన విధంగా భోజ‌నాల‌ను చేస్తుంటారు. అయితే సైంటిస్టుల అధ్య‌య‌నం ప్ర‌కారం.. రోజుకు 3 లేదా 6 సార్లు..? ఎన్నిసార్లు భోజ‌నం చేస్తే మంచిది ? అంటే..

Health Tips 3 or 6 how many times is good for health

రోజుకు 3 సార్ల క‌న్నా 6 సార్లు భోజ‌నం చేస్తే మంచిద‌ని, 6 సార్లు భోజ‌నం చేసిన‌ప్పుడు త‌క్కువగా తింటారు క‌నుక జీర్ణ వ్య‌వ‌స్థ‌పై పెద్ద‌గా భారం ప‌డ‌ద‌ని.. అందువ‌ల్ల ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో ఆహారం తినాల‌ని చెబుతుంటారు.

అయితే కొంద‌రు మాత్రం 3 సార్లు చాల‌ని, రోజుకు 6 సార్లు భోజ‌నం చేస్తే షుగ‌ర్ ఉన్న‌వారికి, అధిక బ‌రువు త‌గ్గేవారికి ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. క‌నుక రోజుకు 3 సార్లే తినాల‌ని చెబుతున్నారు. దీనిపై సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలిందేమిటంటే..

రోజుకు 3 లేదా 6 సార్లు.. ఎన్నిసార్లు భోజ‌నం చేసినా.. వ‌చ్చే ఫ‌లితాల్లో పెద్ద‌గా మార్పు ఉండ‌ద‌ని అంటున్నారు. రోజూ తినే విధంగానే తినాల‌ని సూచిస్తున్నారు. ఎవ‌రైనా స‌రే త‌మ సౌక‌ర్యానికి అనుగుణంగా రోజూ భోజ‌నం చేయాలి. కానీ భోజ‌నంలో పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అంతేకానీ.. రోజుకు 6 సార్లు తిన‌డం లేదా 3 సార్లే తినాల‌నే నియ‌మాలు పెట్టుకోకూడ‌దు. సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Editor

Recent Posts