Jaggery Coconut Laddu : ఈ ల‌డ్డూ ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

Jaggery Coconut Laddu : బెల్లం, కొబ్బ‌రి.. ఈ రెండూ మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం అంత సుల‌భం కాదు. కానీ వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా.. ఒకే ల‌డ్డూతో రెండింటిలో ఉండే పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Jaggery Coconut Laddu very healthy eat daily one make in this way
Jaggery Coconut Laddu

బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొబ్బరి తురుము – ఒక కప్పు, బెల్లం – ఒక కప్పు, యాలకుల పొడి – 1 టీస్పూన్‌.

బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూల‌ను త‌యారు చేసే విధానం..

బెల్లం గడ్డను ముక్కలుగా చేయాలి. మరుగుతున్న నీటిలో బెల్లంపొడి వేసి కరిగే వరకూ కలియ‌బెడుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ట‌వ్‌ మీద పాన్‌ పెట్టి తురిమిన కొబ్బరి వేయాలి. ఇందులో బెల్లం పాకం కూడా వేసి కల‌పాలి. చిన్నమంట పెట్టి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలియ‌బెడుతూ ఉండాలి. మిశ్రమం దగ్గర పడిన తర్వాత దించే ముందు యాలకుల పొడి వేసి కల‌పాలి. తర్వాత దించేయాలి. మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ల‌డ్డూలుగా గుండ్రటి షేప్‌లో వ‌త్తుకోవాలి. దీంతో బెల్లం కొబ్బ‌రి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని రోజుకు ఒక‌టి తిన్నా చాలు. ఎంతో మేలు జ‌రుగుతుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts