Adhika Baruvu : ప్రస్తుత కాలంలో మనల్నిందరిని వేధిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో అధిక కొవ్వు సమస్య కూడా ఒకటి. పొట్ట, నడుము, తొడలు, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన ఈ కొవ్వు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, షుగర్ వ్యాధితో పాటు కాలేయం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ అధిక కొవ్వు ప్రాణాంతకంగా కూడా మారతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ కొవ్వును కరిగించడం చాలా అవసరం. కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
శరీరంలో అధికంగా పేరుకుపోయిన ఈ కొవ్వును ఒక ఇంటి చిట్కా ద్వారా మనం తొలగించుకోవచ్చు. కొవ్వును కరిగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కొబ్బరి నూనెను, కర్పూరం బిళ్లలను, విక్స్ వేపరబ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత అందులో పావు టీ స్పూన్ విక్స్ ను వేయాలి. తరువాత 3 లేదా 4 కర్పూరం బిళ్లను పొడిగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని శరీరంలో కొవ్వు పేరుకుపోయిన చోట చర్మం పై రాసి మర్దనా చేయాలి. తరువాత దీనిపై కాటన్ వస్త్రాన్ని లేదా పాలిథిన్ కవర్ ను చుట్టి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. బయట గాలి చర్మానికి తాకకుండా ఇలా వస్త్రాన్ని చుట్టుకోవాలి. కొవ్వును కరిగించడంలో ఈ మిశ్రమం ఎంతో చక్కగా పని చేస్తుంది. అధిక కొవ్వుతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల కొవ్వు కరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.