Aloe Vera And Olive Oil : దీన్ని జుట్టుకు రాసి చూడండి.. జుట్టు పెరుగుదల చూసి ఆశ్చర్యపోతారు..!

Aloe Vera And Olive Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అవి ఏవైనా సరే జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం, బలహీనంగా మారడం, చుండ్రు వంటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే జుట్టు సమస్యలకు అనేక చిట్కాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ అందరికీ సెట్‌ కావు. అలాంటప్పుడు ఏదో ఒక చిట్కా ట్రై చేయాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక కలబందతో తయారు చేసే ఈ మిశ్రమాన్ని వాడితే ఎవరికైనా సరే తప్పక ఫలితం వస్తుంది. దీంతో జుట్టు సమస్యలు అన్నీ పోతాయి. దీన్ని ఎలా తయారు చేయాలి.. అందుకు ఏమేం కావాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద జెల్‌ను కొద్దిగా తీసుకుని అందులో ఆలివ్‌ ఆయిల్‌ ను వేసి కలపాలి. కొలత కావాలంటే ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్‌ను వేయాలి. అందులోనే మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. బాగా మర్దనా చేయాలి. అనంతరం 30 నిమిషాలు అలాగే ఉండాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే లేదా హెర్బల్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టుకు కావల్సిన బలం లభిస్తుంది. జుట్టు పొడవుగా, దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

Aloe Vera And Olive Oil for hair how to use this
Aloe Vera And Olive Oil

ఈవిధంగా కలబంద, ఆలివ్‌ ఆయిల్‌ మిశ్రమం వాడడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కలబందలో ఉండే విటమిన్‌ ఎ, సి, ఇ జుట్టును సంరక్షిస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అందువల్ల రెండు రకాలుగా లాభాలను పొందవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని కనీసం వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది జుట్టును పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. మెరుస్తాయి. చుండ్రు నుంచి కూడా బయట పడవచ్చు. ఇది అందరికీ చక్కగా పనిచేసే చిట్కా అని చెప్పవచ్చు.

Share
Editor

Recent Posts